మల్టివర్స్ లో బాలయ్య.. సాధ్యమేనా?


యాక్షన్ హీరోగా బాలయ్య వరుస హ్యాట్రిక్ హిట్స్ తో మంచి జోరు మీద ఉన్నారు. భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ తర్వాత వెంటనే బాబీ దర్శకత్వంలో మూవీని సెట్స్ పైకి తీసుకొని వెళ్తున్నారు. ఈ మూవీ షూటింగ్ డిసెంబర్ లో స్టార్ట్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే దీని తర్వాత బాలయ్య మూవీ ఎవరితో ఉంటుందనే చర్చ ఇప్పుడు నడుస్తోంది. బాలయ్యకి హ్యాట్రిక్ ఇచ్చిన బోయపాటి శ్రీను లైన్ లో ఉన్నారు. 


అఖండ సీక్వెల్ బాలయ్యతో ఉంటుందని ఇప్పటికే బోయపాటి ప్రకటించారు. అయితే అంతకంటే ముందుగా సూర్య హీరోగా ఒక పాన్ ఇండియా మూవీ చేయాలని బోయపాటి ప్లానింగ్. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రస్తుతం సూపర్ హీరో కథలతో యూనివర్స్ క్రియేట్ చేస్తున్నాడు. అందులో మొదటి చిత్రంగా హనుమాన్ వస్తోంది. దీని తర్వాత అధీరా అనే మూవీ కూడా ఎనౌన్స్ చేశాడు. వరుసగా సూపర్ హీరోల చిత్రాలు చేయాలని ఆలోచన. అయితే ఇప్పుడు బాలయ్యతో ఒక మైథలాజికల్ ఫాంటసీతో మల్టీవర్స్ మూవీ సిరీస్ కి ప్రశాంత్ వర్మ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్ స్టాపబుల్ షోకి ప్రశాంత్ వర్మ డైరెక్టర్ గా చేస్తున్నారు. ఇక్కడే బాలయ్యతో ప్రశాంత్ బాండింగ్ ఏర్పడిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ వర్మకి ఒక కథ సిద్ధం చేసుకోమని బాలయ్య సూచించారంట. 


ఇక ప్రశాంత్ వర్మ అయితే బాలయ్య కోసం ఏకంగా ఫిక్షనల్ జోనర్ లో మైథలాజికల్ కాన్సెప్ట్ తో ఫాంటసీ కాన్సెప్ట్ సిద్ధం చేసి మెప్పించినట్లు టాక్. బాలయ్య కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ మూవీ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు బాలయ్యని రెగ్యులర్ మాస్ హీరోగానే ప్రేక్షకులు చూడటానికి ఇష్టపడ్డారు. ఇప్పుడు కంప్లీట్ గా జోనర్ మార్చేసి డిఫరెంట్ ఫార్మాట్ లో పెజెంట్ చేయాలని అనుకోవడం ఇంటరెస్టింగ్ గా మారింది. బాలయ్య కెరియర్ లో ఆదిత్య 369, భైరవ ద్వీపం లాంటి సినిమాలు ఉన్నాయి. వాటి స్ఫూర్తితో మరో కొత్త ప్రపంచాన్ని ప్రశాంత్ వర్మ సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ నిజంగా పట్టాలు ఎక్కితే మాత్రం కచ్చితంగా బాలయ్య బ్రాండ్ ఇమేజ్ కూడా అమాంతం పెరిగిపోతుందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. 

Post a Comment

Previous Post Next Post