2023లో కోలుకోలేని దెబ్బ కొట్టిన సినిమాలు..!


ప్రతి ఏడాది హిట్ సినిమాలతో పాటు ఫ్లాప్ లు కూడా పడుతూ ఉంటాయి. ఇది పెద్ద ప్రత్యేకమైన విషయం కాదు. కానీ కొంత మంది స్టార్ హీరోల చిత్రాలు భారీ అంచనాలతో వచ్చి థియేటర్స్ లో ప్రేక్షకులని పూర్తిగా నిరుత్సాహపరుస్తాయి. భారీ బడ్జెట్ తో నిర్మించిన నిర్మాతకి భారీ నష్టాలు కూడా మిగుల్చుతాయి. అలాంటి సినిమాలు ఈ ఏడాది పెద్ద పెద్ద హీరోలకి వచ్చాయి. 



మెగాస్టార్ హీరో మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన భోళా శంకర్ ఈ ఏడాది అతి పెద్ద డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. మెగాస్టార్ ఇమేజ్ కూడా ఈ సినిమా నష్టాలని తగ్గించలేకపోయింది. మూవీలో మెగాస్టార్ పెర్ఫార్మెన్స్ మీద సైతం విమర్శలు రావడం విశేషం. ఆచార్య తర్వాత అంతకుమించిన డిజాస్టర్ గా భోళా శంకర్ మెగాస్టార్ ఖాతాలో చేరింది.


డార్లింగ్ ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన ఆదిపురుష్ సినిమా రిలీజ్ కి ముందు నుంచి వివాదాలతోనే నడిచింది. ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చిన తర్వాత ఆడియన్స్ పూర్తిగా నిరాశకి గురయ్యారు. కథ, కథనాలు మార్చేయడంతో పాటుగా శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ లుక్ కూడా ప్రేక్షకులకి నచ్చలేదు. రాధేశ్యామ్ తర్వాత ప్రభాస్ ఖాతాలో మరో డిజాస్టర్ గా ఆదిపురుష్ నిలిచింది.


అక్కినేని యువ హీరో అఖిల్ కెరియర్ లో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ సక్సెస్ లేదు. అయితే డిజాస్టర్స్ గురించి చెబితే మొదటి సినిమా అఖిల్ వెంటనే గుర్తుకొస్తుంది. దానికి మించిపోయే విధంగా ఈ ఏడాది రిలీజ్ అయినా ఏజెంట్ డిజాస్టర్ అయ్యింది. నిర్మాతకి భారీ నష్టాలని ఈ మూవీ మిగిల్చింది. అఖిల్ కెరియర్ ని నిలబెడుతుంది అనుకుంటే ఇమేజ్ ని డ్యామేజ్ చేసింది.


మరో అక్కినేని హీరో నాగ చైతన్య ఖాతాలో కూడా కస్టడీ రూపంలో డిజాస్టర్ వచ్చి చేరింది. గత ఏడాది థాంక్యూతో ఫ్లాప్ కొట్టిన చైతన్య ఈ ఏడాది వెంకట్ ప్రభు లాంటి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తో విభిన్నమైన కథతో కస్టడీ చేశారు. అయితే ఈ సినిమాలో కథని కరెక్ట్ గా ప్రెజెంట్ చేయకపోవడం వలన ఆడియన్స్ తిరస్కరించారు. దీంతో చైతూ ఖాతాలో డిజాస్టర్ మూవీగా మారింది. 


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఈ ఏడాది గాండీవదారి అర్జున మూవీతో బిగ్గెస్ట్ డిజాస్టర్ ని ఖాతాలో వేసుకున్నారు. అలాగే గోపీచంద్ రామబాణం కూడా కూడా నిర్మాతకి భారీ నష్టాలు తీసుకొచ్చింది. పెద్ద హీరోలు ఉన్న కూడా కంటెంట్ నచ్చకపోవడంతో ఆడియన్స్ థియేటర్స్ కి రాలేదు. ఈ ఫ్లాప్ లతో ఒక్కటైతే క్లారిటీ వచ్చింది. సినిమా కథలో దమ్ములేకపోతే స్టార్ హీరో ఉన్న కూడా కలెక్షన్స్ ని రాబట్టడం కష్టం అని దర్శక, నిర్మాతలకి అర్ధమైంది.

Post a Comment

Previous Post Next Post