యానిమల్ జోయా.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? 


సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన యానిమల్ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇప్పటికి థియేటర్స్ లో డీసెంట్ కలెక్షన్స్ తో మూవీ దూసుకుపోతోంది. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఆమె పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. అయితే రష్మిక హీరోయిన్ అయిన కూడా ఇందులో నటించిన మరో బ్యూటీ మొత్తం క్రెడిట్ ఎత్తుకుపోయింది. ఆ బ్యూటీ తృప్తి డిమ్రి. జోయా అనే పాత్రలో నటించింది.

మూవీలో రణబీర్ కపూర్ తో ఇంటిమేట్, బోల్డ్ సన్నివేశాలలో నటించిన తృప్తి డిమ్రి రాత్రికి రాత్రే పాపులర్ అయిపొయింది. అంతకు ముందు చాలా బాలీవుడ్ సినిమాలలో చేసిన రాని గుర్తింపు యానిమల్ తో ఒక్క రాత్రిలోనే ఈ బ్యూటీకి వచ్చేసింది. బాలీవుడ్ లో ఎక్కడ చూసిన తృప్తి డిమ్రి పేరు వినిపిస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీ గురించి తెగ చర్చించుకుంటున్నారు. 

యానిమల్ సినిమాలో అంత బోల్డ్ గా నటించిన తృప్తి డిమ్రి అందుకున్న రెమ్యునరేషన్ 40 లక్షలు అని తెలుస్తోంది. అయితే పెద్దగా గుర్తింపు లేకపోయిన మూవీలో బోల్డ్, ఇంటిమేట్ సీన్స్ చేయడం వలన ఆమెకి ఈ స్థాయిలో రెమ్యునరేషన్ ఇచ్చారట. అయితే ఇప్పుడు మాత్రం తృప్తి తన కొత్త ప్రాజెక్ట్స్ విషయంలో రెమ్యునరేషన్ అమాంతం పెంచేసినట్లు తెలుస్తోంది. అయిన కూడా ఆమెకున్న డిమాండ్ నేపథ్యంలో అవకాశాలు పుష్కలంగా వస్తూనే ఉన్నాయి. టాలీవుడ్ దర్శక, నిర్మాతలు సైతం తమ సినిమాల కోసం ఇప్పుడు తృప్తిని సంప్రదిస్తున్నారంట.

Post a Comment

Previous Post Next Post