గౌతమ్ మీనన్ అప్పులు.. ఆ పొరపాటే కొంపముచ్చింది!

 


సూర్య సన్నాఫ్ కృష్ణన్, ఘర్షణ, ఏ మాయ చేసావే.. ఈ సినిమాలకు తెలుగు తమిళ్ లో ఒక సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ అనగానే అందరికి ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీలు గుర్తొస్తాయి. ఆ పేరు చూసి ఒకప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ ఎగబడి సినిమాలు కొనుక్కునే వారు. అంతలా గుర్తింపు అందుకున్న ఆయన ఇప్పుడు దాదాపు 70 నుంచి 80 కోట్ల మధ్యలో అప్పుల బారిన పడ్డారు. అందుకు కారణం తన టాలెంట్ తో సొంతంగా ఆదాయం పెంచుకోవాలి అనుకున్నారు.


2010 వరకు ఇతర నిర్మాతలతో సినిమాలు చేసుకుంటూ వచ్చిన ఆయన ఆ తరువాత తమిళనాడు నుంచి ముంబై వరకు బడా ఫైనాన్షియర్స్ నుంచి అధిక వడ్డీలకు అప్పులు తీసుకున్నారు. ఇదంతా ఒక్కసారి చేసిన అప్పు కాదు. 2011 నుంచి 2013 వరకు ఒక్కో సినిమా నష్టపోతుంటే అప్పుల భారం పెరిగింది. 2011 లో 'నడునిసి నాయ్గల్' సినిమా నుంచి కెరీర్ గాడి తప్పింది. ఎటో వెళ్లిపోయింది మనసు రెండు భాషల్లోనూ తేడా కొట్టేసింది. బాలీవుడ్ లో రీమేక్ చేసిన ఏ మాయ చేసావే కూడా డిజాస్టర్ అయ్యింది. ఇక ధృవ నచ్చతిరం తో అన్ని అప్పులు తీర్చేసుకోవాలి అనుకున్న టైమ్ లో ఆ సినిమా కూడా ఆర్థిక కారణనాల వలన చాలా కాలం సెట్స్ పైనే కొనసాగింది. ఇప్పటికి దాన్ని రిలీజ్ చేయలేక గౌతమ్ సతమతమవుతున్నాడు. ఇక ఆర్థికంగా కాస్త నిలదొక్కుకోవాలి అని నటుడిగా బిజీ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు.

Post a Comment

Previous Post Next Post