మెగా యువ హీరోల బడ్జెట్ బాధలు

 

మెగా హీరోలలో ప్రస్తుతం యువ హీరోలు వరుస అపజయాలతో సతమతమవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ రామ్ చరణ్ ఈ నలుగురు కూడా వారి కంటే ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ పెంచుకుని సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా ముందుకు కొనసాగుతున్నారు. అయితే వీరి తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వరుణ్ తేజ్ సాయి ధరంతేజ్ వైష్ణవ తేజ్ ముగ్గురు కూడా సరైన మార్కెట్ లేక ఇబ్బంది పడుతున్నారు అని చెప్పవచ్చు.


అంతే కాకుండా వీరిని నమ్మి హై బడ్జెట్ పెట్టాలి అన్నా కూడా ప్రొడ్యూసర్స్ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.  గని సినిమాతో పాటు ఇటీవల కాలంలో వచ్చిన గని గాండీవ దారి అర్జున సినిమాలు వరుణ్ తేజ్ మార్కెట్ ను దారుణంగా దెబ్బ కొట్టాయి. లేటెస్ట్ గా వచ్చిన ఆపరేషన్ వాలెంటైన్ కూడా డిజాస్టర్ లిస్టులో చేరిపోయింది. సాయి ధరమ్ తేజ్ ఆ మధ్య విరూపాక్ష సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ ఆ తర్వాత మామయ్యతో బ్రో సినిమా చేశాడు.

కానీ అదేమీ అంతగా సక్సెస్ కాలేదు. ఇక ప్రస్తుతం గాంజా శంకర్ అనే సినిమా బడ్జెట్ కారణాల విషయం వలన మళ్లీ ఆగిపోయినట్లుగా తెలుస్తోంది. ఇక వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమా తర్వాత చేసిన సినిమాలు ఏవి కూడా పెద్దగా మార్కెట్ ను పెంచలేదు. హీరోలపై నమ్మకంతో పెద్ద బడ్జెట్ పెట్టాలంటే ఇప్పుడు నిర్మూతలు ఆలోచించుకోవాల్సి వస్తోంది. వరుణ్ తేజ్ మట్కా సినిమా బడ్జెట్ కూడా మళ్లీ తగ్గించినట్లుగా తెలుస్తోంది. డిఫరెంట్ కథలు మాత్రమే కాకుండా హీరోను చూసి సినిమాకి రావాలి.. అప్పుడే హీరోలకు మార్కెట్ లో డిమాండ్ పెరుగుతుంది. ఆ దిశగా మెగా యువ హీరోలు ప్రయత్నం చేస్తున్నా వర్కౌట్ కావడం లేదు. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి కథలు సెలెక్ట్ చేసుకుంటారో చూడాలి.

Post a Comment

Previous Post Next Post