అట్లీ - త్రివిక్రమ్.. లెక్క తేలేది ఆ రోజే!

 


అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా అనంతరం ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడు అనేది ఇంకా ఫైనల్ కాలేదు. లిస్టులో అయితే త్రివిక్రమ్ తో పాటు బోయపాటి కూడా ఉన్నారు. అలాగే సందీప్ రెడ్డి వంగాతో కూడా ఒక ప్రాజెక్టును అధికారికంగా ఎనౌన్స్ చేశారు. అతనితో సినిమా చేయడానికి ఇంకా చాలా సమయం అయితే ఉంది. ఇక పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ మొదట త్రివిక్రమ్ తోనే ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. అది కూడా పాన్ ఇండియా రేంజ్ తగ్గట్టుగా ఉండేలా ప్లాన్ చేశారు.


అయితే ఇప్పుడు హఠాత్తుగా మళ్లీ లిస్టులోకి తమిళ దర్శకుడు అట్లీ వచ్చి చేరాడు. త్రివిక్రమ్ తో దాదాపు సెట్ అయిపోయింది అని అనుకున్న టైంలో అల్లు అర్జున్ తో అట్లీ కూడా చర్చలు జరుపుతూ ఉండడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఏప్రిల్ 8వ తేదీన అల్లు అర్జున్ నెక్స్ట్ ఎవరితో వర్క్ చేస్తాడు అనే విషయం తేలిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే అదే రోజు అల్లు అర్జున్ పుట్టినరోజు. ప్రస్తుతం 
అట్లీ అయితే పూర్తిస్థాయిలో స్క్రిప్టు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. త్రివిక్రమ్ కూడా తన వైపు నుంచి ప్రయత్నం గట్టిగానే చేస్తున్నాడు. మరి బన్నీ ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో తెలియాలి అంటే అతని పుట్టినరోజు వరకు ఆగాల్సిందే.

Post a Comment

Previous Post Next Post