అంటే.. ఎన్టీఆర్ 31 మరింత లేటుగా..

 


జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుంది అని మూడేళ్ళ క్రితమే క్లారిటీ ఇచ్చేశారు. అసలైతే ఈ సినిమా దేవర పూర్తయిన తర్వాతనే పట్టాలు ఎక్కాలి. కానీ ఊహించిన విధంగా దేవర రెండు భాగాలు అని చెప్పడం, షూటింగ్ ఆలస్యం అవ్వడంతో లైనప్ లో మార్పులు వచ్చాయి.  ప్రశాంత్ కూడా సలార్ 2 ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకు వచ్చాడు. అంతేకాకుండా బాలీవుడ్ వార్ 2 ప్రాజెక్టుపై కూడా క్లారిటీ వచ్చేసింది.


దీంతో ఈపాటికే మొదలు కావాల్సిన ఎన్టీఆర్ 31వ సినిమా మళ్లీ 2 ఏళ్ల తర్వాత కూడా వచ్చే అవకాశం లేదని అనిపిస్తుంది. సలార్ 2 వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత లేదా ఆ ఏడాది చివరలో రావచ్చు. ఇక ఎన్టీఆర్ ప్రాజెక్టు స్క్రిప్ట్ పనులు కూడా ఇంకా చాలా వరకు బ్యాలెన్స్ ఉన్నాయి. సలార్ 2 పూర్తయిన తర్వాత దాదాపు ఒక ఐదు నెలలు నీల్ స్క్రిప్ట్ పై కూర్చునే అవకాశం ఉంది. అంటే ఎన్టీఆర్ ప్రాజెక్టు 2026 మధ్యలో గానీ చివర్లో గాని స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక సినిమా వచ్చేసరికి 2028 అయినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు అని అర్థమవుతుంది.

Post a Comment

Previous Post Next Post