గామీ మూవీ - రివ్యూ & రేటింగ్


కథ:

మానవ స్పర్శ తగిలితేనే ఏమాత్రం తట్టుకోలేని ఒక వింత సమస్యతో బాధపడుతుంటాడు అఘోరా శంకర్ (విశ్వక్ సేన్). దీంతో అతను అఘోరా సమూహం నుండి బయటకు రావాల్సి వస్తుంది. ఎవరైనా అతన్ని తాకగానే తెలియని జ్ఞాపకాలు తనను వెంటాడుతూ ఉంటాయి. కానీ అవి అర్థం కావు. ఇక తన పరిస్థితిని నయం చేసే ఔషధాన్ని కనుగొనడానికి శంకర్ హిమాలయాలకు ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. ఇక జాహ్నవి (చాందిని చౌదరి) అతనితో ప్రమాదకర మార్గంలో ప్రయాణం సాగిస్తుంది. అసలు శంకర్‌కి ఏమైంది? మిగతా రెండు కథలకు శంకర్ కు సంబంధం ఏమిటి? అతనికి ఈ పరిస్థితి ఎలా వచ్చింది? అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


విశ్లేషణ:
మొదటగా ఇలాంటి కథను రాసుకున్న డైరెక్టర్ ను దాన్ని సెలెక్ట్ చేసుకున్నందుకు హీరోను తప్పకుండా ప్రశంసించి తీరాల్సిందే. శంకర అనే అఘోరా పాత్రలో విశ్వక్ కనిపించిన విధానం తీసుకున్న జాగ్రత్తలు ప్రతి ఒక్కటి కూడా బిగ్ స్క్రీన్ పై చాలా హైలెట్ గా నిలిచాయి. శంకర్ తో పాటు కథలో మరో రెండు జీవితాలకు సంబంధించిన అంశాలు కూడా కొనసాగుతూ ఉంటాయి. ఈ క్రమంలో దర్శకుడు ఆ మూడు కథలకు కనెక్షన్ ఏంటి అనే పాయింట్ తో స్క్రీన్ ప్లేను చక్కగా డిజైన్ చేసుకున్నాడు.

 కథకు తగ్గట్టుగా నటీనటుల పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చాయి. మొదట్లోనే కథానాయకుడు ఎదుర్కొన్న సమస్య ఏంటి అలాగే అతని ప్రయాణం ఎంత కఠినంగా ఉండబోతోంది అనే పాయింట్స్ కూడా చాలా చక్కగా హైలెట్ అయ్యాయి. అంతేకాకుండా మనిషి పై చేసే ప్రయోగాలు మరొకవైపు దేవదాసికి సంబంధించిన అంశాన్ని కూడా చక్కగా ప్రజెంట్ చేశారు. ఇక ఈ మూడు విభిన్నమైన పరిస్థితులకు ఎలాంటి కనెక్షన్ ఉంది అనే పాయింట్స్ సెకండ్ హాఫ్ పై మరింత హైప్ క్రియేట్ చేశాయి.


ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడా కాస్త డల్ మూమెంట్స్ ఉన్నప్పటికీ సెకండ్ ఆఫ్ కు సరైన ప్లాట్‌ను సెట్ చేస్తుంది. సెకండాఫ్‌లో శంకర్ క్యారెక్టర్ లో కొంత ల్యాగ్ అనిపిస్తుంది. ఇక అతని ప్రాణాపాయ ప్రయాణం కోసం జాహ్నవి కూడా ప్రయాణం చేరుతుంది. అయితే దాని వెనుక కారణం మరింత బలంగా ఉండాల్సింది. ఇక హిమాలయాల బ్యాక్ డ్రాప్ సీన్స్ విజువల్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. 

బడ్జెట్ 15 కోట్లు దాటలేదని తెలుస్తోంది. ఇంత తక్కువ బడ్జెట్‌లో విజువల్ ఎఫెక్ట్స్ పర్ఫెక్ట్ ఫ్రేమ్‌లు సెట్ చేసిన విధానానికి మేకర్స్ ను మెచ్చుకోవాల్సిందే. కథ కథనంలోనే స్లోగా ఉండడం తప్పితే గామి మిగతా విషయాల్లో ఎంతగానో ఆకట్టుకుంటుంది. అలాగే ఆలోచింపజేస్తుంది. ఇక సినిమా చివరి 20 నిమిషాలు కూడా అద్బుతమనే చెప్పాలి. ముఖ్యంగా మ్యూజిక్ కూడా సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ గా చెప్పవచ్చు. కెమెరా పనితనం కూడా పర్ఫెప్ట్ గా హైలెట్ అయ్యింది. ఇక పాత్రలలో మాత్రం విశ్వక్ మిగతా వారిని డామినేట్ చేయడం విశేషం. 

ప్లస్ పాయింట్స్:
👉విశ్వక్ సేన్ అఘోరా క్యారెక్టర్
👉బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
👉సెకండ్ హాఫ్ చివరి ఎపిసోడ్
👉కెమెరా వర్క్, విజువల్స్

మైనస్ పాయింట్స్:
👉కొన్ని ల్యాగ్ సీన్స్
👉కొన్ని చోట్ల ఏమోషన్ మిస్సవ్వడం

రేటింగ్: 3/5

Post a Comment

Previous Post Next Post