రాజా సాబ్.. పెద్ద కంటెంట్ తోనే..

 


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి దర్శకత్వంలో చేస్తున్న మూవీ రాజాసాబ్. హర్రర్ కామెడీ జోనర్ లో ప్రభాస్ మార్కెట్ కంటే తక్కువ బడ్జెట్ తో ఈ మూవీ చేస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వంద కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోన్న సినిమాకి ప్రభాస్ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదు. లాభాల్లో వాటా తీసుకుంటూ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ప్రభాస్ కి జోడీగా కనిపిస్తారంట.


ఇప్పటికే ప్రభాస్ ఫస్ట్ లుక్ ని డైరెక్టర్ మారుతి రివీల్ చేశాడు. లుంగీ కట్టుకొని జోవియల్ గా స్మైల్ తో నడుచుకుంటూ వస్తోన్న స్టిల్ ని షేర్ చేశారు. దీంతో మూవీ ఎలా ఉండబోతోంది అనే విషయంలో ముందుగానే ఒక హింట్ ఇచ్చేశాడు. సినిమా కథ మొత్తం ఒక బంగ్లా బ్యాక్ డ్రాప్ లో నడుస్తుందని తెలుస్తోంది. మూవీలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ప్రభాస్ ఒకప్పటి మేనేజర్, ఫ్రెండ్ అయిన ప్రభాస్ శ్రీను ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పాడు. రాజాసాబ్ మూవీ కాన్సెప్ట్ ఇప్పటి వరకు తెలుగులో రాలేదని, సరికొత్త కథాంశంతో మూవీ ఉండబోతోందని స్పష్టం చేశాడు. పాన్ ఇండియా కంటే పెద్ద మూవీగా రాజాసాబ్ ఉండబోతోందని చెప్పాడు. ఈ సినిమాలో ప్రభాస్ కి చాలా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ లో ఆడియన్స్ చూస్తారని అన్నాడు. ఎప్పుడూ చూడని యాంగిల్ గా ప్రభాస్ కనిపిస్తాడని చెప్పుకొచ్చాడు.

ప్రభాస్ శ్రీను చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజాసాబ్ చిత్రాన్ని వీలైనంత వేగంగా పూర్తి చేసి నెక్స్ట్ సలార్ పార్ట్ 2, స్పిరిట్ సినిమాలని డార్లింగ్ సెట్స్ పైకి తీసుకొని వెళ్లాలని అనుకుంటున్నాడు. తరువాత కల్కి పార్ట్ 2, హను రాఘవపూడి మూవీ కూడా లైన్ లో ఉన్నాయి. ఇక రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ కి జోడీగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, ఆషికా రంగనాథ్ నటిస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post