ప్రశాంత్ వర్మ.. బాలీవుడ్ హీరో సెట్టయినట్లే..

 


టాలెంటెడ్ యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమన్ సినిమాతో ఒక్కసారిగా బాలీవుడ్ ఇండస్ట్రీని కూడా ఆకర్షించాడు. ఇప్పుడు అతనితో సినిమా చేయడానికి ఒక బాలీవుడ్ నిర్మాణ సంస్థ గట్టిగానే చర్చలు జరుపుతోంది. ప్రశాంత్ కూడా ఒకవైపు జై హనుమాన్ సినిమా పనులను కోనసాగిస్తూనే మరొకవైపు బాలీవుడ్ ఇండస్ట్రీతో కొత్త ప్రాజెక్టుపై కూడా చర్చలు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే అందులో హీరోగా కూడా ఒక బాలీవుడ్ హీరో ఫిక్స్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


అతను మరెవరో కాదు హై ఎనర్జిటిక్ హీరో రన్వీర్ సింగ్ అని టాక్. రణవీర్ సింగ్ ఈ మధ్యకాలంలో సౌత్ ఇండస్ట్రీ దర్శకులతో కూడా సినిమాలు చేయాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే హనుమాన్ సినిమాతో సక్సెస్ అందుకున్న విధానంతో ఇప్పుడు అతని కన్ను ప్రశాంత్ వర్మ పై పడింది. ఇక ప్రముఖ నిర్మాణ సంస్థకు ఇప్పటికే కథ గురించి చెప్పిన ప్రశాంత్ హీరోకి కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధమైన తర్వాతనే ఈ కాంబినేషన్ పై క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నారు. పూర్తిస్థాయిలో ప్రశాంత్ కథను సిద్ధం చేసుకుని మరోసారి నిర్మాత, హీరోని కలిస్తే ప్రాజెక్టు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ యువ దర్శకుడు వారిని ఎంత త్వరగా మెప్పిస్తాడో చూడాలి.

Post a Comment

Previous Post Next Post