మహేష్ - రాజమౌళి.. ఇంకా ఎన్ని పుట్టిస్తారో..

 


రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తాడా అని ఫ్యాన్స్ అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నారు. సినిమా షూట్ స్టార్ట్ కావడానికి ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. సినిమా పై జక్కన్న ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో కానీ రకరకాలుగా గాసిప్స్ అయితే ఊహించిన విధంగా ఫ్యాన్స్ ను కన్ఫ్యూజన్ కు గురి చేస్తున్నాయి. సినిమాలో మహేష్ బాబు తొమ్మిది భిన్నమైన లుక్స్ లో కనిపిస్తాడు అని అలాగే ఇందులో డబుల్ యాక్షన్ అని కూడా జోరుగా ప్రచారాలు చేస్తున్నారు.


ఇక సినిమాలో హాలీవుడ్ స్టార్ యాక్టర్ కూడా ఉంటాడు అని నాగర్జున కూడా ఒక స్పెషల్ రోల్ చేయబోతున్నట్లు కూడా ఈ మధ్యనే పుకార్లు పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. సినిమా బడ్జెట్ అయితే 1000 కోట్లు, 1500 కోట్లు అని కూడా కథనాలు వస్తున్నాయి. ఇది వరకే రైటర్ విజయేంద్రప్రసాద్ ఇది ఆఫ్రికా అడవుల్లో నేపథ్యంలో ఉంటుంది అని ఒక క్లారిటీ అయితే ఇచ్చారు.

 రాజమౌళి మహేష్ ను అడ్వెంచరస్ హీరోగా చూపిస్తాడు అని అందరూ ఊహించేసుకుంటున్నారు. ఇక గాసిప్స్ అన్నిటికి కూడా ముగింపు కార్డు పడాలి అంటే సినిమా షూటింగ్ మొదలు కావాల్సిందే. అప్పుడైనా కొన్ని లీక్స్ ద్వారా సినిమా ఎలా ఉండబోతుంది అనేది అర్థమవుతుంది. ఇక రాజమౌళి రెండు నెలల వర్క్ షాప్ నిర్వహించిన తర్వాత సినిమా షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది  రెగ్యులర్ షూటింగ్ దసరా తర్వాత లేదా ఈ ఏడాది చివర్లో మొదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Post a Comment

Previous Post Next Post