దర్శకులను అతిగా నమ్మెస్తున్న ప్రభాస్

కొంతమంది స్టార్ హీరోలు దర్శకులకు చాలా ఎక్కువ స్థాయిలో ఫ్రీడం ఇస్తారు అనే టాక్ మన ఇండస్ట్రీలో ఇప్పటికి వినిపిస్తూనే ఉంటుంది. అలా అయితేనే డైరెక్టర్ మంచి అవుట్ ఫుట్ ఇస్తాడాని నమ్ముతారు. సాధారణంగా తమిళ హీరోలు, బాలీవుడ్ నటులు దర్శకులను అంత ఈజీగా నమ్మరు. కాస్త స్క్రిప్ట్ కు తగ్గట్టుగా షూటింగ్ కొనసాగడం లేదు అనే అనుమానం వస్తే చాలు చర్చలు జరుపుతారు. అయితే టాలీవుడ్ లో మాత్రం అలా ప్రవర్తించే హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో మహేష్ బాబు టాప్ లిస్టులో ఉంటాడు. అయితే బ్రహ్మోత్సవం దెబ్బ తర్వాత మహేష్ కాస్త మారాడు కానీ ప్రభాస్ మాత్రం ఇంకా దర్శకులను పాత పద్ధతిలోనే నమ్ముతున్నట్లుగా తెలుస్తోంది. బాహుబలి తర్వాత పెద్దగా అనుభవం లేని దర్శకులతో వర్క్ చేసిన ప్రభాస్ వారిపై అతి నమ్మకం పెట్టుకోవడం వలన డిజాస్టర్ లను ఎదుర్కొన్నాడు.


బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ కూడా ఆదిపురుష్ తో ఎంత దారుణమైన డిజాస్టర్ ఇచ్చాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇప్పుడు చేస్తున్న కల్కి రాజా సబ్ దర్శకులు నాగ్ అశ్విన్, మారుతి కి కూడా ప్రభాస్ ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినట్లు టాక్ గట్టిగానే వస్తోంది. ఇక రాబోయే మరో ప్రాజెక్ట్ ను హను రాఘవపూడిచేయబోతున్నాడు. ఆ సినిమా టెక్నీషియన్స్ హీరోయిన్ విషయంలో కూడా ప్రభాస్ అయితే ఏమాత్రం తన ఐడియాలు ఇవ్వడం లేదు. డైరెక్టర్ హను దాదాపు సీతారామం టెక్నీషియన్స్ ను కంటిన్యూ చేస్తున్నాడు. హీరోయిన్ గా మృణాల్ ను సెలెక్ట్ చేశారని తెలుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ గా విశాల్ చంద్రశేఖర్ ను ఫిక్స్ చేస్తున్నారు. ఈ విషయంల ప్రభాస్ కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని తెలుస్తోంది. ఒక విధంగా స్క్రిప్ట్ వరకే తన అభిప్రాయాలను చెబుతున్న ప్రభాస్ ఆ తరువాత డైరెక్టర్ నిర్ణయం ప్రకారం ముందుకు కొనసాగుతున్నట్లు టాక్.

Post a Comment

Previous Post Next Post