విశ్వంభర డబుల్ యాక్షన్.. హీరో కాదు!

 


మెగాస్టార్ చిరంజీవి యువ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో చేస్తున్న మూవీ విశ్వంభర సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. UV క్రియేషన్స్ 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో క్యాస్టింగ్ కూడా గట్టిగానే ఉండబోతున్నట్లు అర్థమవుతుంది. మెగాస్టార్ కు 5 మంది చెల్లెళ్ళుగా యువ హీరోయిన్స్ కనిపించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాల్లో మృణాల్ టాగూర్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతోంది.


దేవాలోకానికి సంబంధించిన ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ను దర్శకుడు సినిమాలో హైలెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపు జగదేకవీరుడు అతిలోకసుందరి తరహాలోనే ఈ సినిమా కూడా అడ్వెంచర్ ఎలిమెంట్స్ తో ఉండబోతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ తో డబుల్ ట్రీట్ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. హీరో మెగాస్టార్ తో కాకుండా ఈసారి హీరోయిన్ ను రెండు విభిన్నమైన పాత్రల్లో చూపిస్తారని తెలుస్తోంది. రెండు పాత్రల్లో కనిపించేది మరెవరో కాదు.. మెయిన్ బ్యూటీ త్రిష కృష్ణన్.  ఒక విధంగా మెగాస్టార్ సినిమాలో ఇలాంటి అవకాశం రావడం ఆమెకు చాలా లక్కీ అని చెప్పాలి. నాలుగు పదుల వయసు వస్తున్న కూడా త్రిష ఇంకా తన అందంతో ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తూనే ఉంది. మరి ఇప్పుడు విశ్వంభరలో ఆమె తన రెండు క్యారెక్టర్లతో ఎలాంటి క్రేజ్ అందుకుంటుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post