కమ్ముల 'కుబేర'.. పెద్ద ట్విస్టే ప్లాన్ చేస్తున్నాడుగా..

 


క్లాస్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ప్రస్తుతం తన స్టైల్ మార్చి మాస్ ఆడియన్స్ కి చేరువ అయ్యే విధంగా ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్ తో పాన్ ఇండియా మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. అది కూడా తమిళ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జునతో కలిసి మల్టీ స్టారర్ గా ఈ మూవీని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.


ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. శివరాత్రి సందర్భంగా ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ వీడియోని రిలీజ్ చేశారు. మూవీకి కుబేరా అనే టైటిల్ ని ఖరారు చేశారు. శివుడికి పార్వతీదేవి భిక్ష వేస్తోన్న ఫోటో ఫ్రేమ్ ని రిప్రజెంట్ చేస్తూ దాని నుంచి గెడ్డంలో మాసిన బట్టలతో ధనుష్ లుక్ ని రివీల్ చేశారు. దీనిని బట్టి మూవీలో ధనుష్ బిచ్చగాడి క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది.

బిచ్చగాడి నుంచి మాఫియా డాన్ గా మారిన వ్యక్తిగా ధనుష్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో మూవీలో కనిపించబోతున్నాడంట. ఇక ఈ చిత్రంలో కింగ్ నాగార్జున పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడంట. అలాగే శివుడికి సంబంధించిన ఒక హిస్టారికల్ పాయింట్ ను కూడా సినిమాలో హైలెట్ చేయనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య సీరియస్ డ్రామా తో కుబేరా మూవీ ఉంటుందనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ మూవీ కాన్సెప్ట్ వింటూంటే శేఖర్ కమ్ముల గత సినిమాలకి భిన్నమైన బ్యాక్ డ్రాప్ కనిపిస్తోంది.

శేఖర్ కమ్ముల సినిమాలంటే కథ కంటే పాత్రల ప్రయాణం తెరపై కనిపిస్తూ ఉంటుంది. ఆ పాత్రలకి ఆడియన్స్ ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతారు. అందుకే అతని సినిమాలు మంచి హిట్ అవుతాయి. ఈ సినిమాలో కూడా తనకి బలం అయిన పాత్రల చిత్రణని విడిచిపెట్టకుండానే మాస్ యాంగిల్ లో మూవీని ప్రెజెంట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Post a Comment

Previous Post Next Post