దేవిశ్రీప్రసాద్ చేతిలో 6 సినిమాలు.. సంపాదన ఎంతంటే?


రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ గతంలో మాదిరిగా రొటీన్ కమర్షియల్ సినిమాలు ఎక్కువగా ఒప్పుకోవడం లేదు. సెలెక్టీవ్ కథలు ఓకే చేస్తున్నప్పటికీ లైనప్ పెద్దగానే ఉంది. దాదాపు 6 సినిమాలకు అగ్రిమెంట్ చేసుకున్న రాక్ స్టార్ ఒక్కో సినిమాకు ఒక్కో తరహా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. గత రెండేళ్ళ ముందు వరకు ప్రతీ సినిమాకు 3 కోట్ల రేంజ్ లో ఛార్జ్ చేసిన దేవి ఇప్పుడు మాత్రం కంటెంట్ నచ్చితే చిన్న సినిమాలకు అంతకంటే తక్కువ ఆదాయాన్ని అందుకుంటున్నారు. 


పుష్ప 2, కంగువ, కుబేర లాంటి పాన్ ఇండియా సినిమాలకు దేవి దాదాపు 5 కోట్ల రేంజ్ లో ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక లిస్టులో రామ్ చరణ్ 17 (సుకుమార్) లాంటి సినిమాలు కూడా ఉన్నాయి. వాటికి ఇంకా ఎక్కువగానే ఛార్జ్ చేయవచ్చు. ఎందుకంటే పుష్ప 2 తరువాత వచ్చే సినిమా కాబట్టి. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, నాగచైతన్య తండెల్, అజిత్ గుడ్ బాడ్ అగ్లీ లాంటి కమర్షియల్ సినిమాలు కూడా ఉన్నాయి. వాటికి కూడా తక్కువేమీ తీసుకోవట్లేదు. కీరవాణి తరువాత ఇండస్ట్రీలో ఎక్కువ డిమాండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ దేవి మాత్రమే. మరి రాబోయే రోజుల్లో లెక్క ఎంతవరకు వెళుతుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post