పవన్ వారసుడు.. టైమ్ దగ్గరపడింది!


పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో మరింత బిజీగా ఉండటం తో సినీ పరిశ్రమలో అతని స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే చర్చలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పవన్ అభిమానులు ఈ క్రమంలో అకీరానందన్ వైపు ఆసక్తిగా చూస్తున్నారు. గత కొన్ని నెలలుగా అకీరా పబ్లిక్ ఈవెంట్స్ లో ఎక్కువగా కనిపిస్తూ, అభిమానులకు చేరువవుతుండడం గమనార్హం. చంద్రబాబు నాయుడు గెలుపు తర్వాత ఇంటికి వచ్చినప్పుడు, నరేంద్రమోడీని కలిసినప్పుడు, ప్రమాణ స్వీకార మహోత్సవం సమయంలో ప్రతిచోటా అకీరా హాజరయ్యాడు.


ఇప్పటికే పవన్ కళ్యాణ్ కొడుకు సినీ రంగప్రవేశం గురించి అగ్ర నిర్మాతతో చర్చలు జరిపినట్లు సమాచారం. అకీరా కెరీర్ ఆరంభం కోసం సరైన కథ, దర్శకుడు కోసం పవన్ వేచి ఉన్నట్టు తెలుస్తోంది. ఫ్యాన్స్ ఆకాంక్షలు మేరకు, అకీరా బిగ్ స్క్రీన్ ఎంట్రీకి సిద్ధమవుతాడా అనే ఉత్కంఠ నెలకొంది. సుదర్శన్ థియేటర్లో "తమ్ముడు" రీ రిలీజ్ స్పెషల్ షోలో అకీరా కనిపించడంతో అభిమానులు ఉత్సాహంగా స్పందించారు.

మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల మాదిరి, అకీరా కూడా ఒక గ్రాండ్ లాంచ్ కోసం ప్లాన్ చేస్తున్నారని టాక్. పవన్ రాజకీయాల్లో పూర్తిగా లీనమైపోవడంతో, తన లెగసీని కొనసాగించాల్సిన భాద్యత అకీరా భుజాలపై పడుతుంది. ఈ సవాలు ఎదుర్కోవడం సులభం కాదు, కానీ అకీరా లో ఉన్న టాలెంట్, కృషి చూసి అభిమానులు ఆశాభావంతో ఉన్నారు.  మొత్తం మీద, అకీరా నందన్ సినిమా రంగ ప్రవేశం గురించి జరుగుతున్న చర్చలు మరింత ఉత్కంఠను కలిగిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పొలిటికల్ కమిట్‌మెంట్స్ కారణంగా సినిమా అవకాశాలు తగ్గించినప్పటికీ, అకీరా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టడం అభిమానులకు కొత్త ఆశలను కలిగిస్తోంది.

Post a Comment

Previous Post Next Post