జాతిరత్నాలు డైరెక్టర్ ఎక్కడ? ఏం చేస్తున్నాడు?

యువ దర్శకుడు అనుదీప్ కెవి "జాతిరత్నాలు" సినిమా అనంతరం ఒక్కసారిగా డౌన్ అయ్యాడు. ఈ చిత్రం అతనికి భారీ పేరుని తెచ్చిపెట్టిన్నప్పటికి అతను ఆ క్రేజ్ ను కంటిన్యూ చేయలేకపోతున్నారు. జాతిరత్నాల ముందు పిట్టగోడ అనే సినిమాతో అనుదీప్ తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. అయితే, ఆ చిత్రం పెద్దగా గుర్తింపు పొందకపోయినా, జాతిరత్నాలు అతనికి విజయాన్ని సాధించిపెట్టింది. అనంతరం, అనుదీప్ శివ కార్తికేయన్‌తో కలిసి చేసిన ప్రిన్స్ ప్రాజెక్ట్ ఆశించినంతగా విజయవంతం కాలేదు.


ఈ సినిమా తర్వాత, విక్టరీ వెంకటేష్‌తో మరో ప్రాజెక్ట్ మీద అనుదీప్ పని చేయడం ప్రారంభించాడు. సురేష్ ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అయినప్పటికీ, అనుకోని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయింది. అనంతరం రవితేజతో కూడా చర్చలు జరిగినప్పటికి ప్లాన్ సెట్టవ్వలేదు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో మరో ప్రాజెక్ట్ గురించి వార్తలు వినిపించినప్పటికీ, ఈ ప్రాజెక్ట్ కూడా ఇంకా పట్టాలెక్కలేదు. సితార ఎంటర్టైన్మెంట్స్ అనుదీప్‌ను హోల్డ్‌లో ఉంచినట్లు సమాచారం.

ఇటీవల ఒక మెగా హీరోకు అనుదీప్ ఓ కథ చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది.  స్టోరీలైన్ నచ్చినప్పటికీ, ప్రస్తుత ఆ మెగా హీరో సినిమా పూర్తికావడానికి సమయం ఉండటం వల్ల, అనుదీప్ ప్రాజెక్ట్ ఇప్పట్లో మొదలుకావడం అనుమానంగా ఉంది. ప్రస్తుతం, అనుదీప్ నెక్స్ట్ మూవీ ఎప్పుడు వస్తుందో అన్న ప్రశ్నకు స్పష్టత రాలేదు. అభిమానులు అతని కామెడీని మిస్ అవుతున్నామని సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్‌తో అనుదీప్ తప్పకుండా ఒక సినిమా చేయాలని నిర్ణయించింది. అతను పర్ఫెక్ట్ స్క్రిప్ట్‌తో నమ్మకాన్ని కలిగిస్తే, త్వరలోనే ప్రాజెక్ట్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

Post a Comment

Previous Post Next Post