సుధీర్ బాబు హరోం హర.. హిట్టా ఫట్టా..?

sudheer babu

సుధీర్ బాబు నటించిన తాజా చిత్రం "హరోంహర" ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం సెహరి లాంటి యూత్ మూవీని రూపొందించిన జ్ఞానసాగర్ దర్శకత్వంలో రూపొందింది. సుధీర్ బాబు ఈ సారి ప్రయోగాల జోలికి వెళ్లకుండా పక్కా కమర్షియల్ సబ్జెక్టును ఎంచుకున్నాడు. కథ పరంగా, సుబ్రహ్మణ్యం (సుధీర్ బాబు) అనే వ్యక్తి బ్రతుకుతెరువు కోసం కుప్పంలో ఒక కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్ గా చేరతాడు. అతను తన టీచర్ (మాళవిక శర్మ)ను ప్రేమిస్తాడు. తన తండ్రి (జయప్రకాశ్) అప్పుల పాలయ్యాడు కాబట్టి, సులభంగా డబ్బు సంపాదించడానికి స్నేహితుడు పళని స్వామి (సునీల్) సలహాతో తుపాకులు తయారు చేసే వ్యాపారం మొదలుపెడతాడు.


స్థానిక గ్యాంగ్ లీడర్ తమ్మిరెడ్డి (లక్ష్మణ్)తో మొదట్లో స్నేహంగా ఉండి, తరువాత శత్రుత్వంగా మారతాడు. ఈ క్రమంలో స్పెషల్ ఆఫీసర్ (అక్షర) వల్ల సుబ్రహ్మణ్యం ఎదుర్కొనే సమస్యలు, అతని మాఫియా లీడర్ గా ఎదుగుదల ప్రధానంగా ఈ కథలో ఉంటుంది. దర్శకుడు జ్ఞానసాగర్ ఎనభై దశక నేపథ్యంతో, అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా కథను రాసుకున్నాడు. సుధీర్ బాబులోని మాస్ యాంగిల్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు ఈ కథను ఎంచుకున్నాడు. చిత్తూరు బ్యాక్ డ్రాప్ తో తుపాకుల వ్యాపారంలో దిగి, మాఫియాగా ఎదిగిన యువకుడి కథను పుష్ప తరహా ట్రీట్‌మెంట్‌తో తెరకెక్కించారు.  

సినిమాలో మాస్ సన్నివేశాలు చాలా బాగా రాసుకున్నారు. హరోంహరలో పుష్ప, కెజిఎఫ్, విక్రమ్ లాంటి భారీ చిత్రాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. తండ్రి అప్పులు కారణంగా మాఫియా వైపు వెళ్లడం వంటి పాయింట్ మరింత కన్విన్సింగ్ గానే హైలెట్ చేసి ఏమోషన్ ను హైలెట్ చేశారు. ఈ చిత్రంలో చాలా మాస్ బ్లాక్ బస్టర్ షేడ్స్ కనిపిస్తాయి. హీరోయిజం ఎలివేట్ చేసే క్రమంలో నాటకీయత పండిస్తేనే ఇలాంటి సీన్లు థియేటర్లో విజయవంతమవుతాయి. జ్ఞానసాగర్ సుధీర్ బాబును మ్యాచో మ్యాన్ గా చూపించడం పై ఎక్కువ దృష్టి పెట్టాడు, కొన్ని సీన్స్ లో అది బాగా వర్కౌట్ అయ్యింది. పక్కా కమర్షియల్ సబ్జెక్టును ఎంచుకోవడం సాహసమైతే, కథా నేపథ్యాన్ని మరింత బలోపేతం చేయడం సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచింది. మరి పాజిటివ్ రియాక్షన్ అందుకుంటున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్లు అందుకుంటుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post