విజయ్ సినిమా కోసం త్రివిక్రమ్ కొడుకు.. ఏం పని చేస్తున్నాడంటే


సీనియర్ స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ తన కుటుంబంతో తిరుమలను సందర్శించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ లో త్రివిక్రమ్ పెద్ద కుమారుడు రిషి అందరినీ ఆకట్టుకుంటున్నారు. రిషి లుక్ చూసిన చాలా మంది అభిమానులు ఆయన హీరోగా తెరంగేట్రం చేస్తారని ఊహించటం మొదలుపెట్టారు. కానీ తాజా సమాచారం ప్రకారం, రిషి తన తండ్రి బాటలోనే, దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నాడు.


విజయ్ దేవరకొండ మరియు గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో రూపొందుతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీలో రిషి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ కూడా తన కుమారుడి డైరెక్షన్ టాలెంట్ ను గుర్తించి, అతడిని నేటితరం యువ దర్శకుల వద్ద శిక్షణ పొందేలా చేశారు. ఇక త్రివిక్రమ్ ప్రాజెక్టుల విషయానికి వస్తే, ఇటీవల మహేష్ బాబుతో చేసిన "గుంటూరు కారం" మూవీ నిరాశ పరిచింది. దాంతో త్రివిక్రమ్ తన తదుపరి ప్రాజెక్ట్ పై శ్రద్ధ పెట్టారు. ప్రస్తుతం అల్లు అర్జున్ తో మరో చిత్రం చేసేందుకు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేస్తున్నట్లు సమాచారం. "పుష్ప -2" తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

Post a Comment

Previous Post Next Post