అకిరా నందన్ కు మెగాస్టార్ గిఫ్ట్.. రేణు దేశాయ్ పవర్ఫుల్ రియాక్షన్


పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ స్పష్టమైన స్టాండ్ తో సోషల్ మీడియాలో చురుకుగా ఉంటున్నారు. ఇటీవల, ఆమె తన సోషల్ మీడియా ఖాతాలలో వ్యక్తిగత విషయాలకు సంబంధించిన అనేక రూమర్లకు చెక్ పెడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ సక్సెస్ సందర్బంగా అకిరా నందన్ పై వస్తున్న రూమర్లకు కూడా ఆమె చెక్ పెడుతున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయాన్ని సాధించిన తరువాత, అకిరా నందన్ మీడియా మరియు సోషల్ మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నాడు.


అకిరా పిక్స్ మరియు ఆయన సినీ ఎంట్రీపై రకరకాల వార్తలు వస్తున్నాయి. రేణు దేశాయ్ ఆమె కుమారుడు అకిరా సినీ రంగంలోకి రావడంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వార్తలు రావడంతో అలంటిదేమి లేదని ఆమె ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఇక లేటెస్ట్ గా ఒక యూట్యూబ్ ఛానల్ అకిరాకు మెగాస్టార్ చిరంజీవి భారీ ధర కలిగిన కారును గిఫ్ట్ ఇచ్చినట్లుగా వీడియోను పోస్ట్ చేసింది. అయితే, ఈ వీడియో గురించి రేణు దేశాయ్ వివరణ ఇవ్వడంతో అది పూర్తిగా ఫేక్ అని తేల్చేసింది. యూట్యూబ్ లో వచ్చే ప్రతి వార్తను నమ్మడం సరికాదని, అవన్నీ ఫేక్ న్యూస్ అని ఆమె పేర్కొన్నారు. ఈ విషయం గురించి రేణు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కూడా వివరించారు.

యూట్యూబ్ వాళ్ళు ఇలాంటి ఫేక్ న్యూస్ క్రియేట్ చేసే బదులు సినిమా స్క్రిప్ట్ రాస్తే మంచిదేమో.. అని ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా ఈ రూమర్లను ఆపాలని సూచిస్తున్నారు. అనవసరమైన థంబ్ నెయిల్స్ తో ఇబ్బంది పెట్టడం సరి కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే, పవన్ కళ్యాణ్ ఇటీవల ఏపీ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు అకిరా సంప్రదాయ దుస్తులలో, ఎరుపు రంగు చొక్కా మరియు పంచె కట్టుతో హాజరయ్యారు. ఈ ఫోటోలను రేణు దేశాయ్ తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ కి అభినందనలు తెలుపుతూ ఆమె పోస్ట్ చేసారు.

Post a Comment

Previous Post Next Post