ఇండియన్ 2.. అసలు బడ్జెట్ కు బజ్ కు సంబంధం ఏమైనా ఉందా?


శంకర్ కమల్ హాసన్ కాంబినేషన్లో వస్తున్న బిగ్ బడ్జెట్ మూవీ  ఇండియన్ 2. ఈ సినిమా జులై 12న ప్రేక్షకులకు ముందుకు రాబోతోంది. దర్శకుడు శంకర్ అలాగే కమల్ హాసన్ ఇప్పటికే ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ఇక అనిరుద్  స్వరపరచిన పాటలు కూడా  ఇదివరకే విడుదల అయ్యాయి. సినిమాలో నటించిన అందరూ కూడా వారి శక్తి మేరకు  ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. అయితే  హడావిడి బాగానే కనిపిస్తున్నప్పటికీ సినిమాపై బజ్ మాత్రం అంతగా పెరగడం లేదు.


దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన సినిమా. హిట్ కాంబో.. హిట్ సినిమాకు సీక్వెల్.. అన్ని అంశాలు అనుకూలంగా ఉన్నప్పటికీ బజ్ లేదు. శంకర్ నుంచి వస్తున్న సినిమాకు మొదటిసారి చాలా తక్కువ స్థాయిలో అంచనాలు ఉన్నాయి అని కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. సినిమాలో కమల్ హాసన్ క్యారెక్టర్ కంటే సిద్ధార్థ క్యారెక్టర్ ఎక్కువ నిడివి తో హైలెట్ కాబోతున్నట్లు   కొన్ని లీక్స్ రావడంతో అక్కడే సగం బజ్ తగ్గిపోయింది.

సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే భారతీయుడు 3 లోనే  కమలహాసన్ క్యారెక్టర్ ఎక్కువ విడివితో ఉంటుందట. కాబట్టి భారతీయుడు 2 ఫస్ట్ పార్ట్  పై విడుదల అయ్యేవరకు రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది అనుమానం గానే ఉంది. ఏదేమైనా సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వస్తేనే బాక్సాఫీస్ వద్ద అనుకున్న టార్గెట్ ను పూర్తి చేసుకుంటుంది. అలాగే శంకర్ కూడా ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంటేనే ఆ తర్వాత రాబోయే గేమ్ ఛేంజర్ కు కూడా మంచి బజ్ అయితే క్రియేట్ అవుతుంది.

Post a Comment

Previous Post Next Post