పుష్ప 2 సినిమతో 1000 కోట్ల మార్కెట్ ను టచ్ చేయాలనే ఆలోచనతోనే మేకర్స్ ఇన్ని రోజులు చాలా స్ట్రాంగ్ గా వర్క్ చేశారు. ముఖ్యంగా అల్లు అర్జున్ మొదటి నుంచి అదే టార్గెట్ గా కష్టపడుతున్నాడు. మరోవైపు ఆలస్యం అవుతున్నా వాయిదా పడుతున్నా కాన్ఫిడెన్స్ కోల్పోకుండా సుక్కు తన టీమ్ ను లీడ్ చేస్తూ వచ్చాడు. అయితే హీరో హఠాత్తుగా అలిగాడు అంటూ పుకార్లు మొదలయ్యాయి. గెడ్డం తీసేసి మరి షూటింగ్ కు బ్రేక్ చెప్పినట్లు రూమర్స్ గుప్పుమంటున్నాయి. ఇది నిజమా కాదా అనే సంగతి పక్కన పెడితే సుకుమార్ అతి పర్ఫెక్షన్ కు మాత్రం హీరోతో పాటు మిగతా టీమ్ అందరూ కూడా కాస్త ఇబ్బంది పడ్డారనే మాట వాస్తవం. ఒకప్పుడు అతని పర్ఫెక్షన్ కు ఫ్యాన్ అని చెప్పిన అల్లు అర్జున్ ఇప్పుడు ఆ డోస్ కారణంగా కాస్త అప్సెట్ అయినట్లు కథనాలు గట్టిగానే వినిపిస్తున్నాయి.
సుకుమార్ అనే కాదు ఏ దర్శకుడుకి అయినా కూడా మేకింగ్ విషయంలో హీరోలతో ఈ తరహా క్లాష్ లు సర్వసాధారణం. అయితే 300 కోట్ల పెట్టుబడులు పెట్టిన సినిమా విషయంలో అలకలు క్లాష్ లు ఎన్ని వచ్చినా కూడా అవన్నీ పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. అసలే మైత్రి మూవీ మేకర్స్ ఎప్పుడు కూడా ఖర్చు గురించి ఆలోచించలేదు. డైరెక్టర్ హీరోలపై ఒత్తిడి తేకుండా ప్రొడక్షన్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక వారి కెరీర్ లో ఇప్పటివరకు ఇదే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ. కావున అలకలు గొడవలు ఎన్ని ఉన్నా కూడా కాస్త మాట్లాడుకుని సాల్వ్ చేసుకోవాల్సిందే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సుకుమార్ వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్స్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ తరహా క్లాష్ రూమర్స్ పై మైత్రి నుంచి అఫీషియల్ గా ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.
Follow
Post a Comment