ఏఐ సినిమాలు.. భవిష్యత్ లో ముప్పా?


మొన్నటి వరకు సినిమాలు అంటే సెట్స్, స్టార్స్, టెక్నీషియన్స్ తో కూడిన పెద్ద ప్రక్రియ. కానీ ఇప్పుడు కేవలం ఒక ఆఫీస్, కంప్యూటర్లు, ఏఐ సాఫ్ట్‌వేర్ ఉంటే సరిపోతుందన్న స్థాయికి మారుతున్నాయి. బాలీవుడ్ లో ఇప్పటికే రామాయణం, చిరంజీవి హనుమాన్ వంటి ప్రాజెక్టులు పూర్తిగా ఏఐ మాడ్యూల్ తో రూపొందిస్తామన్న ప్రకటనలు రావడం ఆందోళన కలిగిస్తోంది. విఎఫ్ఎక్స్, యానిమేషన్ దాటుకుని నేరుగా ఏఐతో సినిమా తీయాలన్న ట్రెండ్ మొదలవ్వడం పెద్ద చర్చకు దారితీసింది.

ఈ కొత్త ట్రెండ్ పై దర్శకుడు అనురాగ్ కశ్యప్ బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశాడు. మనుషుల ఎమోషన్స్ కి ఏఐ ప్రత్యామ్నాయం కాదని, ఖర్చు తగ్గించాలన్న ఉద్దేశంతో ప్రేక్షకులను మోసం చేయడం సరైన పద్ధతి కాదని సోషల్ మీడియాలో విమర్శించాడు. ఆయన అభిప్రాయం ప్రకారం, ఈ ప్రయత్నాలు కొనసాగితే సినిమాల అసలైన అనుభవం పోతుంది. భావోద్వేగాలు లేకుండా తెరపై కనిపించే బొమ్మలకు డబ్బు చెల్లించాల్సి వస్తే అది పెద్ద అన్యాయం అవుతుందని చెబుతున్నారు.

ఇక భవిష్యత్ లో హీరోలు, హీరోయిన్లు కూడా ఏఐలో సృష్టిస్తే అభిమానులకే కాదు, పరిశ్రమకే పెద్ద నష్టం అవుతుంది. ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి, సృజనాత్మకత విలువ లేకుండా పోతుంది. ఇప్పటికే బాడీ డబుల్స్ తో మేనేజ్ చేస్తున్న స్థితిలో ఏఐ కలిస్తే అది ఇండస్ట్రీకి స్కామ్ లాంటిదే అవుతుందని ఫిలిం సర్కిల్స్ టాక్. కాబట్టి ఈ ట్రెండ్ ను అడ్డుకోవాలా లేదా అనేది త్వరలోనే తేలిపోనుంది.

Post a Comment

Previous Post Next Post