పాత సినిమాతో కూలీ కనెక్షన్!



లోకేష్ కనగరాజ్ సినిమాల్లో పాత క్లాసిక్ మూవీస్ నుంచి ఇన్‌స్పిరేషన్ తీసుకోవడం కొత్తేమీ కాదు. లియో గురించి హిస్టరీ ఆఫ్ వైలెన్స్ ఆధారమని ఓపెన్‌గా చెప్పినా, కూలీ విషయాన్ని రహస్యంగానే ఉంచాడు. కానీ సినిమా తెలిసినవాళ్లు మాత్రం త్వరగానే పసిగట్టేశారు. కూలీలో సత్యరాజ్ కూతుళ్లలో ఒకరు రజనీకాంత్ బిడ్డ అని సెకండాఫ్‌లో వచ్చే ట్విస్ట్ అసలు కొత్తది కాదు. ఇదే ఎపిసోడ్ 1992లో మమ్ముట్టి హీరోగా వచ్చిన మలయాళ హిట్ 'కౌరవర్' లో ఉంది.

ఆ సినిమాలో జైలు నుంచి విడుదలైన మమ్ముట్టి తన కూతురు చనిపోలేదని, తన శత్రువు అయిన పోలీస్ దగ్గర పెరుగుతోందని తెలుసుకుని షాక్ అవుతాడు. కానీ ఆ పోలీస్ కుటుంబంలో ముగ్గురు అమ్మాయిలుండటంతో ఎవరు తన కూతురో తేల్చలేక మానసికంగా ఇబ్బంది పడతాడు. ఈ పాయింట్ చుట్టూ కథ మలుపులు తిరుగుతుంది. అదే కథ తెలుగులో కంకణంగా డబ్ అవ్వగా మంచి హిట్టయింది. అయితే మోహన్ బాబు, కృష్ణంరాజుతో చేసిన రీమేక్ మాత్రం పని చేయలేదు.

లోకేష్ ఇదే పాయింట్‌ని కూలీ కోసం వాడుకున్నాడు. కానీ అక్కడ చివరి వరకు సస్పెన్స్ కొనసాగితే, కూలీలో ముందుగానే రివీల్ చేసి ఎమోషన్ తగ్గించాడు. పోర్టు సెటప్ మాత్రం అమితాబ్ బచ్చన్ దీవార్ నుంచి తీసుకున్నది. రజని 1981లో దీన్ని రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇలా రకరకాల ఎలిమెంట్స్‌ని కలిపిన లోకేష్ ఫైనల్‌గా బాక్సాఫీస్ వసూళ్లు సాధించినా, ఫ్యాన్స్ అంచనాలను అందుకోలేకపోయాడు.

Post a Comment

Previous Post Next Post