బాలీవుడ్ స్టార్ నటుడు అనిల్ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యానిమల్ నుంచి మళ్లీ యువతరానికి దగ్గరైన ఆయన, 90లలో స్టార్ ఖాన్లకే పోటీ ఇచ్చిన హీరో. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఆయన కెరీర్ టాలీవుడ్ తోనే మొదలైంది. 1980లో బాపు దర్శకత్వంలో వచ్చిన వంశవృక్షం సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆ సినిమా ఫ్లాప్ కావడంతో ముంబై తిరిగి వెళ్లి అక్కడే తన స్టార్‌డమ్‌ను నిర్మించుకున్నాడు.
ఇక ఇప్పుడు 45 ఏళ్ల తర్వాత ఆయన తెలుగులో రీఎంట్రీ ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయి. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కుతున్న ఎంటర్టైనర్‌లో అనిల్ కపూర్ కీలక పాత్ర చేయబోతున్నారని సమాచారం. ఇది నిజమైతే, ఈ బై లింగువల్ ప్రాజెక్ట్‌కు (తెలుగు తమిళం) నార్త్ ఇండియాలో కూడా హైప్ పెరుగుతుంది. అయితే ఆయన డేట్స్ బిజీగా ఉండటంతో ఇంకా అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు.
ఇంతకుముందు జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి వార్ 2లో కనిపించినా, అది హిందీ సినిమా కావడంతో రీఎంట్రీగా పరిగణించలేదు. కానీ ఈసారి సూర్య మూవీ మాత్రం డైరెక్ట్ తెలుగు ప్రాజెక్ట్. సూర్య అనిల్ కపూర్ కాంబినేషన్ తెరపై చూడటానికి ఫ్యాన్స్‌కి కొత్త అనుభూతినే ఇస్తుంది. 2026 సమ్మర్‌ను టార్గెట్‌గా పెట్టుకుని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది.
Follow

Post a Comment