విశ్వంభర - టీజర్ వస్తుందా లేదా?



మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు దగ్గరపడుతోంది. ఆగస్ట్ 22 కోసం అభిమానులు పెద్ద ఎత్తున రెడీ అవుతున్నారు. ఇదే సమయంలో విశ్వంభర నుంచి ఏదైనా స్పెషల్ అప్డేట్ వస్తుందా అనే ఆసక్తి పీక్‌కు చేరింది. గత ఏడాది విడుదలైన టీజర్ గ్రాఫిక్స్ కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అందుకే ఈసారి మాత్రం టీమ్ డబుల్ జాగ్రత్తలు తీసుకుంటోంది. కొత్త వీఎఫ్ఎక్స్ టీమ్‌తో పని చేయించి, ఒక్కో ఫ్రేమ్‌ని చెక్ చేస్తూ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ లేకుండా వెళ్తున్నారు.

ఇకపోతే, సంతృప్తి కలిగించే విజువల్స్ చేతికి వచ్చాకే టీజర్ రిలీజ్ చేయాలని యూవీ క్రియేషన్స్, దర్శకుడు వశిష్ఠ, చిరంజీవి ముగ్గురూ ఒకే నిర్ణయానికి వచ్చారట. లేకపోతే పోస్టర్‌తో సరిపెట్టే ఆలోచన కూడా ఉందని టాక్. ఆన్‌లైన్ ట్రోలింగ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈసారి క్వాలిటీ తప్పనిసరి అని ఫిక్స్ అయ్యారు. ఇటీవల దర్శకుడు సాయి రాజేష్ “విశ్వంభర టీజర్ అదిరిపోయింది” అని స్టేటస్ పెట్టడం అభిమానుల్లో మరింత హైప్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం రిలీజ్ డేట్ మాత్రం పెండింగ్‌లోనే ఉంది. అక్టోబర్‌లో ఆప్షన్స్ చూసుకుంటున్నప్పటికీ, వీఎఫ్ఎక్స్ కంపెనీలు సమయానికి డెలివరీ ఇస్తేనే ఫిక్స్ అవుతుంది. అందుకే టీమ్ ఎటువంటి బరువైన ప్రామిస్ ఇవ్వకుండా మౌనం వహిస్తోంది.

Post a Comment

Previous Post Next Post