ఇటీవల కుబేరలో విభిన్న పాత్రతో మెప్పించిన నాగార్జున, కూలీలో స్టైలిష్ విలన్‌గా కనిపించారు. నాగ్ పోషించిన సైమన్ పాత్రకు రిలీజ్‌కి ముందే హైప్ వచ్చినా, ఆశించినంత స్థాయి ఇంపాక్ట్ చూపలేకపోయింది. కుబేర కంటే కూలీపై ఎక్కువ నమ్మకాలు పెట్టుకున్న నాగ్ ఈ విషయంలో కొంత నిరాశకు గురయ్యారని ఇండస్ట్రీ టాక్. కానీ ఇదే సమయంలో ఆయన తదుపరి ప్రాజెక్ట్ పై హాట్ చర్చలు మొదలయ్యాయి.
ఈనెల 29న నాగార్జున పుట్టిన రోజు. అదే రోజు తన 100వ సినిమాపై అధికారిక ప్రకటన ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కాన్సెప్ట్ టీజర్ రెడీగా ఉందని, అది బర్త్ డే స్పెషల్‌గా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ చిత్రానికి రా. కార్తీక్ దర్శకత్వం వహించనున్నారు. స్క్రిప్ట్ విషయంలో నాగ్, టీమ్ ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే నాగ్ ఈసారి ఆ విషయంలో హద్దులు పెట్టుకోకుండా రిస్క్ తీసుకుంటున్నట్లు టాక్. బడ్జెట్ లిమిట్స్ పెట్టకుండా సొంత బ్యానర్ లో గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్లు టాక్.
అన్నపూర్ణ స్టూడియోస్ ప్రారంభమై 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంలో ఈ సినిమా తీస్తుండడం విశేషం. అందుకే ఇది కేవలం నాగ్ 100వ సినిమానే కాకుండా, స్టూడియో ప్రతిష్టకు గుర్తుగా రూపొందబోతుంది. ఫ్యాన్స్ మాత్రం బర్త్ డే రోజున ఏదో పెద్ద సర్ప్రైజ్ కోసం ఎదురుచూస్తున్నారు.
Follow

Post a Comment