వార్ 2 నష్టాల్లో నాగవంశీకి తారక్ సపోర్ట్?


సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీకి జూనియర్ ఎన్టీఆర్ అంటే ప్రత్యేకమైన అభిమానమే. అరవింద సమేతతో మొదలైన బంధం, దేవర సినిమా డిస్ట్రిబ్యూషన్‌ దాకా చేరింది. అయితే తారక్ బాలీవుడ్ ఎంట్రీ అయిన వార్ 2 మాత్రం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద బజ్ తీసుకురాలేకపోయింది. ఇక్కడే నాగవంశీ ముందుకు వచ్చి 80 కోట్ల భారీ రేటుతో హక్కులు కొనుగోలు చేశాడు. కానీ రిజల్ట్ తేడా కొట్టడంతో కలెక్షన్లు సగానికి మించి రాలేదు.

ఈ ఫలితం నాగవంశీకి గట్టి షాక్‌గా మారింది. డిస్ట్రిబ్యూషన్ బయ్యర్లకు ఎల్లప్పుడూ నష్టం భర్తీ చేసే ఆయనకు ఈసారి స్వయంగా లెక్కలు క్లిష్టంగా మారాయి. ఇలాంటి పరిస్థితిలో తారక్ ముందుకు వచ్చి సాయం చేయాలనే ఆలోచన చేశాడట. యశ్ రాజ్ ఫిలిమ్స్‌తో చర్చలు జరిపి కొంత మొత్తం తిరిగి ఇచ్చేలా ఒప్పించినట్లు టాక్. అవసరమైతే తన పారితోషకం లో భాగాన్ని కూడా వెనక్కి వదులుకునేందుకు తారక్ రెడీ అయ్యాడని సమాచారం.

ఈ సెటిల్‌మెంట్ వర్కవుట్ అయితే నాగవంశీకి భారీ నష్టం తప్పుతుందని అంటున్నారు. ఇప్పటికే కింగ్డమ్ సినిమా వల్ల ప్రెషర్‌లో ఉన్న ఆయనకు ఇది కొంత ఊరట ఇస్తుంది. మొత్తానికి అభిమాన నిర్మాతకు తారక్ అండగా నిలిచాడన్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Post a Comment

Previous Post Next Post