పెళ్లి చేసుకున్న చిన్నారి అరుంధతి.. వరుడు ఎవరంటే?


తెలుగు సినిమా ప్రేక్షకులకు అరుంధతి మూవీ ఎంత గుర్తుండిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలో అనుష్క చిన్నప్పటి పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ దివ్య నాగేష్ తన సహజమైన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. జేజమ్మగా తెరపై కనిపించిన ఆమె ఆ తర్వాత కొన్ని సినిమాల్లో బాలనటిగా కనిపించినా, పెద్దయ్యాక మాత్రం సినిమాల నుండి దూరంగా నిలిచింది.

2025 ప్రారంభంలోనే తన నిశ్చితార్థం జరిగిందని వెల్లడించిన దివ్య, తాజాగా తన ప్రియుడు అజయ్ కుమార్‌ను వివాహం చేసుకుంది. అజయ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ కాగా, వీరిద్దరూ ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. ఆగస్టు 18న కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. పెళ్లి ఫోటోలు ఇంకా బయటకు రాకపోయినా, దివ్య తన ప్రీ వెడ్డింగ్ షూట్ స్టిల్స్ మరియు బ్యాచిలర్ పార్టీ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో షేర్ చేసింది.

దివ్య నాగేష్ పెళ్లి వార్త బయటకు రావడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అనుష్క శెట్టి మాత్రం ఇంకా పెళ్లి చేసుకోలేదు. దీంతో అభిమానులు అనుష్క పెళ్లి ఎప్పుడు జరుగుతుందో అనే కామెంట్లతో చర్చ మొదలుపెట్టారు.


Post a Comment

Previous Post Next Post