ఇప్పటికి ఆటోలో, RTC లలో ప్రయాణం. ఒక తెల్లని చొక్కా ఒక ప్యాంటు ఒక కీ ప్యాడ్ ఫోన్. ఇప్పటికీ అద్దె ఇంట్లోనే జీవనం.
నారాయణమూర్తి అడిగితే సినిమాల్లో ఛాన్సులు ఇవ్వడానికి దిగ్గజ దర్శకులు సిద్ధంగా ఉన్నారు, అడ్వాన్స్ లు ఇవ్వడానికి నిర్మాతలు కూడా రెడీగానే ఉన్నారు. కానీ ఆయన ఎవ్వరిని అడగలేదు. అడిగినా చెయ్యలేదు.
నారాయణమూర్తి ఇతరులతో సినిమాలు చేయకపోవడానికి రెండు ప్రధాన కారణాలు, రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు ఆయన చేయరు. తన పాత్రతో సమాజానికి ఏదో ఒక మంచి చెప్పాలి అనే గుణం, సినిమా మొత్తం అలానే ఉండాలని అనుకుంటారు. అలాగే హీరోగా చేసిన తాను సైడ్ క్యారెక్టర్లు చేయను అనే ఒక ఆత్మ నిబద్ధతతో ఫాలో అవుతున్నారు.
ఒకప్పుడు నాయణమూర్తి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే థియేటర్స్ కు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, లారీలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి.
ఇండస్ట్రీలో అప్పట్లో ఎర్రన్న సినిమాలు సెన్సేషన్. అర్ధరాత్రి స్వతంత్రం (1986), అడవి దివిటీలు (1990), లాల్ సలాం (1992), దండోర (1993), ఎర్ర సైన్యం (1994), చీమల దండు (1995), దళం (1996), చీకాటి సూర్యుడు (1998), ఊరు మనదిరా (2002).
7 స్టార్ హోటల్స్ వైభవం కూడా చూసిన ఎర్రన్న ఖరీదైన కార్లలో కూడా తిరిగారు. కానీ అవేమి ఆయనకు సంతోషాన్ని ఇవ్వలేదు.
ఉన్న డబ్బుతో సినిమా చేయాలి, కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయాలి.. అదే ఆయనకు సంతోషం. చాలా పల్లెలకు డెవలప్ కోసం ఆర్థికంగా సహాయం చేశారు. కానీ ఏనాడు బయట చెప్పుకోలేదు.
ఎన్నో పాటశాలల్లో ఉచిత పుస్తకాలు పేద విద్యార్థులకు అండగా కూడా నిలిచారు. కనీసం సహాయం పొందిన వారికి కూడా ఆయన పేరు తెలియనివ్వలేదు. అలాంటి వ్యక్తిత్వం ఆయనది.
హరీష్ శంకర్, శేఖర్ కమ్ముల, త్రివిక్రమ్ లాంటి దర్శకులు వారి సినిమాల్లో నారాయణమూర్తిని తీసుకోవాలని అనుకున్నా ఒప్పుకోలేదు.
ఇక టెంపర్ సినిమాలో పోసాని రోల్ నారాయణమూర్తి చేయాల్సింది. రెండు కోట్ల కంటే ఎక్కువ ఆఫర్ చేసినా ఆయన ఒప్పుకోలేదు.
2004 తరువాత ఎన్నో సినిమాలు చేసినా సరైన సక్సెస్ లేదు. అయినప్పటికీ తన మార్గాన్ని మరువలేదు. ఏదో ఒక సమస్య పైన సినిమా తీసి ఎంతో కొంత జనాలను ఎడ్యుకేట్ చేయాలనే చూస్తారు.
పర్సనల్ లైఫ్ లో ఒకసారి లవ్ సెట్ కాకపోవడంతో మళ్లీ పెళ్లి చేసుకోలేదు.
రోడ్డు పక్కన 10 రూపాయల భోజనం అయినా సంతోషమే, కానీ మనసుని చంపకుకొని మరో దారిలో వెళ్లలేను అని ఎర్రన్న తనకు నచ్చిన మంచి దారిలో వెళుతున్నారు.
ఇక ఆయన దర్శక నిర్మాణంలో రూపొందిన యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమా ఆగస్టు 22న రిలీజ్ కానుంది.

Post a Comment