RRR తర్వాత రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. ఆ సినిమాను చూసిన హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ కూడా ఓపెన్‌గా మెచ్చుకున్నారు. అంతేకాదు, “నీ నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు నేను సపోర్ట్ ఇస్తాను” అని రాజమౌళికి మాట ఇచ్చారని అప్పటి నుంచే టాక్ నడుస్తోంది. ఇప్పుడు అదే నిజం కాబోతోందని ఇండస్ట్రీలో చర్చ జోరందుకుంది. మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న SSMB29 లాంటి సినిమా గ్లోబల్ మార్కెట్‌లో రిలీజ్ కావాలంటే హాలీవుడ్ అండ తప్పనిసరి. అందుకే కామెరూన్ సపోర్ట్ ఉంటే ఈ సినిమా ఎక్కడికో వెళ్తుందని ట్రేడ్ అంచనా.
అయితే ఈ సాయం ఫ్రీగా రావడం లేదని వినిపిస్తోంది. జేమ్స్ కెమెరూన్ తనఅవతార్ 3 సినిమాను ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయబోతున్నాడు. భారత్‌లో ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయాలన్న ఆలోచన ఉంది. కనీసం 600 కోట్ల టార్గెట్‌ను ఇండియన్ మార్కెట్ కోసం ఫిక్స్ చేశారట. అలాంటి సమయంలో రాజమౌళి లాంటి దర్శకుడు స్వదేశంలో ప్రమోట్ చేస్తే, ఆ రీచ్ వేరే లెవెల్‌లో ఉంటుందని అనుకుంటున్నారు.
కాబట్టి కామెరూన్, రాజమౌళిని ప్రమోషన్ విషయంలో సహాయం చేయమని అడిగారని టాక్. రీజినల్ డబ్బింగ్ పనుల్లో కూడా రాజమౌళి సపోర్ట్ కోరే ప్రయత్నం జరుగుతోందట. అయితే ఈ విషయంలో రాజమౌళి ఇంకా క్లారిటీ ఇవ్వలేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి జక్కన్న నుంచి జేమ్స్ కెమెరూన్ కొంత సపోర్ట్ అయితే కోరుతున్నారు. ఇక ఆ విషయంలో జేమ్స్ ను హ్యాపీ చేస్తే వరల్డ్ మార్కెట్ లో రాజమౌళి భవిష్యత్ సినిమాలకు మంచి అండ దొరికే చాన్స్ ఉండవచ్చు.
Follow

Post a Comment