సౌత్ ఇండస్ట్రీలో బలమైన క్యారెక్టర్ రోల్స్‌కి గుర్తొచ్చే పేరు సత్యరాజ్. బాహుబలిలో కట్టప్పగా నటించిన తర్వాత ఆయనకు పాన్ ఇండియా గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచి ప్రతి పెద్ద సినిమాలో కీలక పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. తాజాగా కూలీ లో రాజశేఖర్‌గా అలరించిన ఆయన, ఇప్పుడు త్రిభాణధారి బార్బరిక్ అనే సినిమాలో ప్రధాన పాత్రతో రాబోతున్నారు.
ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న సత్యరాజ్ తన పారితోషకం గురించి ఆసక్తికరంగా స్పందించారు. గతంలో ఎన్నోసార్లు రెమ్యూనరేషన్ విషయంలో రాజీ పడ్డానని, కానీ ఇకపై తగ్గే ప్రసక్తే లేదని చెప్పారు. సినిమా మొదలయ్యే ముందు తక్కువ పారితోషకానికి ఒప్పుకున్నా పర్వాలేదు. కానీ ఒకసారి అంగీకరించిన తర్వాత తగ్గడం సాధ్యం కాదు. బడ్జెట్, నా పాత్ర నిడివిని బట్టి రెమ్యూనరేషన్ ఉంటుంది అని స్పష్టం చేశారు.
47 ఏళ్ల కెరీర్‌లో విలన్‌గా 75 సినిమాలు, హీరోగా వందకు పైగా సినిమాలు చేసిన సత్యరాజ్, ఇప్పుడు పూర్తిగా క్యారెక్టర్ రోల్స్‌పైనే దృష్టి పెట్టారు. “బాహుబలి సినిమాకు తీసుకున్నంత పారితోషకం బార్బరిక్‌కు తీసుకోను. కానీ ఒకసారి చెప్పిన ఫీజులో మాత్రం తగ్గను” అంటూ ఆయన వ్యాఖ్యలు ఫిలిం నగర్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం ఆయన ఒక్క సినిమాకు పాత్ర నిడివిని బట్టి, సినిమా బడ్జెట్ రేంజ్ ను బట్టి 2.5 కోట్ల నుంచి 5 కోట్ల వరకు చార్జ్ చేస్తున్నట్లు టాక్.
Follow

Post a Comment