ఖైదీ 2ని కాదని మల్టీస్టారర్ చేస్తాడా..?



రజనీకాంత్ కూలీకి వచ్చిన మిక్స్ డ్ టాక్ రజిని ఫ్యాన్స్ కంటే లోకేష్ ఫ్యాన్స్ ను ఎక్కువగా నిరాశపరిచింది.  మొదటి వీకెండ్ లో బాగానే కలెక్షన్లు వచ్చినా లియో లాగా లాంగ్ రన్ లో ఊపందుకుంటుందనే అంచనాలు నెరవేరడం లేదు. ఇప్పటికే నాలుగు వందల కోట్లు రాబట్టినా ఇకపై రన్ ఎలా ఉంటుందనే అనుమానం బయ్యర్లలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి దర్శకుడు లోకేష్ కనగరాజ్ పై పడింది. త్వరలో ఖైదీ 2 తో బిజీ అవుతాడనుకునే సమయంలోనే చెన్నై ఫిల్మ్ సర్కిల్ లో కొత్త టాక్ ఊపందుకుంది.

ఆ వార్త ప్రకారం లోకేష్ ఖైదీ 2 స్థానంలో రజనీకాంత్, కమల్ హాసన్ కలయికలో ఒక మల్టీస్టారర్ తో రెడీ అవుతున్నాడట. కొన్ని నెలల క్రితమే మల్టీ స్టారర్ చేస్తున్నట్లు రూమర్ రాగా లోకేష్ ఇంకా కథ సిద్ధం కాలేదు అని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు మళ్లీ ఈ వార్త వెలువడటంతో కూలీ ఫెయిల్యూర్ ని డైవర్ట్ చేయడానికేనా అనే సందేహం కలుగుతోంది. ఎందుకంటే కూలీ ప్రమోషన్లలోనే కార్తీ నాకు లైఫ్ ఇచ్చాడు, మొదట ఖైదీ 2నే స్టార్ట్ చేస్తానని లోకేష్ స్పష్టంగా చెప్పాడు.

అయినా సరే ఒకవేళ రజని, కమల్ నమ్మకంతో అతన్ని పుష్ చేస్తే అది ఇండియన్ సినిమా హిస్టరీ లో వన్ ఆఫ్ ది బెస్ట్ కాంబో అవుతుంది. కానీ సెట్స్ పైకి వెళ్ళేదాకా ఎవరూ నమ్మలేని పరిస్థితి. ఎందుకంటే ఖైదీ 2 స్క్రిప్ట్ పూర్తి కావాలి, అమీర్ ఖాన్ తో ఒక బాలీవుడ్ ప్రాజెక్ట్ ఉంది, రోలెక్స్ లైన్ కూడా ప్లాన్ లోనే ఉంది. కాబట్టి లోకేష్ నెక్స్ట్ మూవీ ఏది అనేది అధికారికంగా చెప్పేదాకా వెయిట్ చేయాల్సిందే.

Post a Comment

Previous Post Next Post