టాలీవుడ్ లో హీరోలకూ, దర్శకులకూ మధ్య చిన్న చిన్న అపార్థాలు తరచూ జరుగుతూనే ఉంటాయి. తాజాగా అలాంటి టాక్ నాగ చైతన్య, శివ నిర్వాణ పేర్లతో వినిపిస్తోంది. ఇటీవల శివ నిర్వాణ చైతన్యకు ఒక కథ వినిపించాడట. అయితే నాగ చైతన్య కొన్ని మార్పులు సూచించాడని, కానీ ఆ సలహాలను లెక్క చేయకుండా డైరెక్టర్ వెంటనే రవితేజ దగ్గరకు వెళ్లిపోయాడని సమాచారం.
శివ నిర్వాణ ఆ కథను తనకు నచ్చినట్లు పర్ఫెక్ట్ గా లాక్ చేసుకున్నట్లు టాక్. అందుకే నాగచైతన్య మార్పులు కోరినా ఎలాంటి సమాధానం ఇవ్వకుండా సైలెంట్ గా మరో హీరో కోసం చూస్తున్నట్లు సమాచారం. ఇక అతని తీరుకు చైతన్య మనసుకు కాస్త బాధ కలిగిందని ఇండస్ట్రీ టాక్. ఇలాంటి టైమ్ లోనే కొరటాల శివ పేరు చర్చల్లోకి వచ్చింది. దేవర సినిమా తరువాత ఆయనకు క్లారిటీ రాకపోయినా, కొత్తగా నాగ చైతన్యతో ఒక ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తున్నారని టాక్ నడుస్తోంది. చైతన్య కూడా ప్రస్తుతం సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. కాబట్టి మంచి స్క్రిప్ట్ తో వస్తే కొరటాలకి డేట్స్ ఇవ్వడంలో ఎటువంటి సమస్య ఉండదని అంటున్నారు.
Follow

Post a Comment