వార్ 2- కూలీ.. కనీసం ఇలాగైనా రూ. 1000కోట్లు వస్తాయనుకుంటే !


బాక్సాఫీస్ పై ఈ వారం భారీ అంచనాల మధ్య వచ్చిన వార్ 2, కూలీ సినిమాలు అనుకున్నంత స్థాయిలో సత్తా చూపలేకపోయాయి. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించిన వార్ 2 మొదటి వీకెండ్ లో సుమారు 265 కోట్లు వసూలు చేసింది. స్టార్ పవర్ తో ఓపెనింగ్స్ వచ్చినా నెగటివ్ టాక్ కారణంగా మళ్లీ మరుసటి రోజు నుంచి కలెక్షన్లు బలహీనపడ్డాయి. మరోవైపు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన కూలీకి 390 కోట్లు రాబట్టి స్ట్రాంగ్ స్టార్ట్ దొరికింది కానీ రివ్యూలు మాత్రం యావరేజ్ గా మారాయి.

ఈ రెండు సినిమాలు మొదటి వీకెండ్ లో 650 కోట్లు వసూలు చేశాయి. ఇదే సమయంలో గతంలో ఒకేసారి వచ్చిన ప్రభాస్ సలార్, షారుక్ ఖాన్ డుంకీ కలసి 600 కోట్లు రాబట్టిన రికార్డుతో పోలికలు మొదలయ్యాయి. ఆ రెండు సినిమాలు కలిపి చివరికి వెయ్యి కోట్ల మార్క్ దాటగా, వార్ 2 మరియు కూలీ మాత్రం ఆ స్థాయికి చేరే అవకాశాలు కనిపించడం లేదు. ట్రేడ్ టాక్ ప్రకారం రెండు సినిమాలు కలిపి 800 నుంచి 900 కోట్లు వరకే చేరతాయని అంచనా.

ఫ్యాన్స్ అయితే ఒక్క కూలీనే వెయ్యి కోట్లు సాధిస్తుందని ఆశించారు. కానీ ఇప్పటి పరిస్థితి చూస్తుంటే వార్ 2 సపోర్ట్ ఉన్నా ఆ టార్గెట్ దూరంగానే అనిపిస్తోంది. అందుకే ఇప్పటికీ ప్రభాస్, షారుక్ కాంబినేషన్ టాప్ రికార్డు సేఫ్ గా నిలిచిందనే మాట ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

Post a Comment

Previous Post Next Post