ఇక అసలు పరీక్ష మాత్రం ఇప్పుడు మొదలవుతోంది. సోమవారం నుంచి హాలిడే హంగామా తగ్గిపోవడంతో కలెక్షన్లలో స్పష్టమైన డ్రాప్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వార్ 2కు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి కఠినంగా మారనుంది. ఇప్పటిదాకా రికవరీ సగం కూడా రాలేదు. డెఫిషిట్లతో షోలు నడపాల్సిన పరిస్థితి రావొచ్చని ట్రేడ్ టాక్ వినిపిస్తోంది.
కూలీ విషయానికి వస్తే, ఇప్పటివరకు 60-70% రికవరీ సాధించినట్లు తెలుస్తోంది. కొన్ని ఏరియాల్లో 80% వరకు చేరింది. అయితే వర్క్‌డేస్‌లో కూడా బలమైన వసూళ్లు రావాలి గానీ బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టమే. ఈ వారం పెద్ద రిలీజ్‌లు లేవు అన్నదే రెండు సినిమాలకూ అదృష్టం. ఈ గ్యాప్‌ను ఎంతవరకు ఉపయోగించుకుంటాయో చూడాలి.
Follow

Post a Comment