Huge Profits to Zombie Reddy before release itself!!
Tuesday, February 02, 2021
0
అ!, కల్కి వంటి విభిన్నమైన సినిమాలతో ఓ వర్గం ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకున్న యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ నెక్స్ట్ జాంబీ రెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. డిఫరెంట్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సినిమా విడుదలకు ముందే ప్రాఫిట్స్ అంధించినట్లు సమాచారం.
అంటే నాన్ థియేట్రికల్ ద్వారా సినిమా పెట్టిన పెట్టుబడికంటే ఎక్కువగా మూడు కోట్లకు పైగా లాభాన్ని అందించినట్లు సమాచారం. హిందీ డబ్బింగ్ రైట్స్ 2.2కోట్లు, తెలుగు శాటిలైట్ రైట్స్ 2.3కోట్లు, ఇక డిజిటల్ మ్యూజిక్ రైట్స్ ద్వారా మరో రెండు కోట్ల దాకా ధర పలికినట్లు సమాచారం. ఈ విధంగా నాన్ థియేట్రికల్ గా సినిమా 6.5కోట్లకు వరకు అందుకుంది. సినిమాకు ఖర్చు చేసింది 3.3కోట్లట. ఇక ఆ విధంగా చూసుకుంటే ఇప్పటికే 3.2కోట్లతో సినిమా ప్రాఫిట్స్ లో నడుస్తోంది. మరి రిలీజ్ అనంతరం కలెక్షన్స్ ఏ రేంజ్ లో అందుకుంటుందో చూడాలి.
Follow @TBO_Updates
Tags