Subscribe Us

Shocking Price for Acharya Nizam Rights!!


మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాతో బాక్సాఫీస్ హిట్ కొట్టడానికి చాలా పవర్ఫుల్ గా రెడీ అవుతున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఆచార్య బిజినెస్ లెక్కలు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. మెగాస్టార్ మార్కెట్ అంతకంతకు పెరుగుతూనే ఉంది గాని ఏనాడు కొంచెం కూడా తగ్గ లేదు. ఇక ఆచార్య మూవీ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా బిజినెస్ వ్యవహారాలు కూడా ఊపందుకున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా నైజాం ఏరియా హక్కులను భారీ ధరకు అమ్ముతున్నట్లు సమాచారం. మొన్నటి వరకు 30కోట్ల వరకు ఉంటుందని టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు డిమాండ్ పెరగడం వలన రేటు 35కోట్లను దాటేసిందని అంటున్నారు. అల్లు అర్జున్ పుష్ప రేటు కూడా దాదాపు అదే రేంజ్ లో నడుస్తోంది. ఇక మెగాస్టార్ సినిమా కాబట్టి బ్రేక్ ఈవెన్ ను అందుకోవాడనికి ఎక్కువ సమయం పట్టదు. సినిమా కోసం దాదాపు 100కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఇక సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 120కోట్ల వరకు ఉండవచ్చని అంటున్నారు.


Post a Comment

0 Comments