Manmadhudu Heroine re-entry after 18 Years!!
Monday, February 08, 2021
0
కొంతమంది హీరోయిన్స్ సక్సెస్ ట్రాక్ లోకి వస్తున్న సమయంలోనే అనుకోకుండా పర్సనల్ లైఫ్ వల్ల సినిమాలకు దురమవుతూ ఉంటారు. ఇక అనుకోని విధంగా కొందరైతే సెకండ్ ఇన్నింగ్స్ ను సరికొత్తగా స్టార్ట్ చేస్తుంటారు. ఇక 18ఏళ్ళ క్రితం తెలుగు జనాలను మన్మథుడు సినిమాతో అమితంగా ఆకట్టుకున్న అన్షు అంబానీ కూడా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం.
2002లో వచ్చిన మన్మథుడు సినిమా ఏ స్థాయిలో విజయాన్ని ఆ అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ సినిమాలో మహేశ్వరి అనే పాత్రలో అమాయకంగా కనిపించిన అన్షు చివరగా 2004జై సినిమా తరువాత మళ్ళీ కనిపించలేదు. ఓ బిజినెస్ మెన్ ను మ్యారేజ్ చేసుకొని లండన్ కు వెళ్లిపోయింది. ఇక ఇన్నాళ్లకు మళ్ళీ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ సినిమా ద్వారా వెండితెరపై కనిపించనున్నట్లు టాక్ వస్తోంది. దర్శకుడు త్రివిక్రమ్ పట్టుబట్టి ఆమెను ఒక స్పెషల్ రోల్ కోసం మళ్ళీ స్వదేశానికి రప్పిస్తున్నట్లు సమాచారం.
Follow @TBO_Updates
Tags