180కోట్లు.. బాధ్యత ఉండక్కర్లే?


ఒక సినిమా సెట్స్ పైకి వచ్చింది అంటే షూటింగ్ ముగిసేవరకు కూడా కొందరికి నమ్మకం ఉండదు. కొన్ని సినిమలైతే షూటింగ్ పూర్తయిన థియేటర్స్ లోకి రావడం లేదు. ఇండియన్ 2ని కూడా ఏ ముహూర్తన మొదలు పెట్టారో గాని సినిమా ఇంకా పూర్తవ్వడం లేదు. ఏదో ఒక వివాదం కారణంగా మరింత ఆలస్యం అవుతోంది.

నిజానికి కమల్ హాసన్ కూడా లైకా ప్రొడక్షన్ తీరుపై మొదటి నుంచి అసంతృప్తితోనే ఉన్నాడు. ముఖ్యంగా యాక్సిడెంట్ జరిగినప్పుడు బాధితులకు నష్టపరిహారం విషయంలో అనుకున్నంత సహాయం చేయకపోవడం వల్లే కమల్ తో విబేధాలు వచ్చినట్లు టాక్. ఇక షూటింగ్ బడ్జెట్ వల్ల శంకర్ ను హోల్డ్ లో పెట్టి మరింత ఆలస్యం చేశారు. దాంతో విసిగిపోయిన అతను మరొక సినిమా స్టార్ట్ చేశాడు. ఇంతలో కేసు వేసినా కూడా న్యాయం శంకర్ కు ఫెవర్ గానే వచ్చింది. 230కోట్ల బడ్జెట్ లో ఇప్పటికే 180కోట్లు ఖర్చు పెట్టినా కూడా లైకా సమస్యను సాల్వ్ చేసుకోలేకపోతోంది. బాధ్యత లేకుండా మొండిగా వెళితే కమల్, శంకర్ ప్రాజెక్టుకు దూరం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Post a Comment

Previous Post Next Post