సుకుమార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా ఆగిపోయినట్లు ఇటీవల కొన్ని రూమర్స్ అభిమానులను కన్ఫ్యూజన్ కు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా సుకుమార్ రామ్ చరణ్ తో కలిసినట్లు టాక్ రాగా అవన్నీ అబద్దాలని తేలిపోయింది.
విజయ్ దేవరకొండ - సుకుమార్ కాంబోలో తెరకెక్కబోయే సినిమాను నిర్మించనున్న ఫాల్కన్ క్రియేషన్స్ అధికారికంగా ఒక క్లారిటీ ఇచ్చేసింది. వైరల్ అవుతున్న రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని అంటూ ప్రాజెక్ట్ తప్పకుండా కరెక్ట్ ప్లాన్ లోనే వెలుతుందని అన్నారు. హీరో దర్శకుడు ప్రస్తుతం చేస్తున్న సినిమాలను ఫినిష్ చేసుకున్న తరువాత ఈ కొత్త సినిమాను మొదలు పెడతారని అన్నారు. ఇక ఇందులో ఎలాంటి మార్పులు ఉండవని సినిమా అంతకు మించి అనేలా ఉంటుందని కూడా వివరణ ఇచ్చారు.
Follow @TBO_Updates
Post a Comment