ఒక సినిమా సెట్స్ పైకి వస్తే షూటింగ్ మధ్యలోనే బిజినెస్ వ్యవహారం మొదలవుతుంది. థియేట్రికల్ గా బిజినెస్ ఎంత అనేది తరువాత సంగతి. ముందుగా నాన్ థియేట్రికల్ గా లాభాలు ఎంత వచ్చయన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతొంది. నిర్మాతలకు కూడా అక్కడే సగం బడ్జెట్ వెనక్కి వచ్చేయ్యాలి. అదే ఫస్ట్ టార్గెట్.
ఇక నాని శ్యామ్ సింగరాయ్ నిర్మాతలు కూడా అదే తరహాలో చర్చలు జరువుతున్నారట. ఇటీవల సినిమాకు సంబంధించిన ఓటీటీ + శాటిలైట్ హక్కుల కోసం రెండు బడా సంస్థలు సంప్రధించగా 30కోట్లకు తక్కువ కాకుండా ఆఫర్ చేశారట. అయితే డిస్ని ప్లస్ హాట్ స్టార్ వాళ్ళు 23కోట్లకు డిమాండ్ చేసినట్లు టాక్. ఇక జీ5 అటు ఇటు ఇటుగా 27కోట్ల దగ్గర చర్చలు జరుపుతోందట. అమెజాన్ ప్రైమ్ ప్రత్యేకంగా ఓటీటీ హక్కుల కోసం నిర్మాతలకు టచ్ లో ఉన్నట్లు సమాచారం. ఈ విషయంలో ఇంకా ఎలాంటి అగ్రిమెంట్ కాకముందే మీడియాలో రూమర్లు మొదలయ్యాయి. మరి నిర్మాతలు ఎంతకు అమ్ముతారో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Follow @TBO_Updates
Post a Comment