రియాలిటీ షోల ద్వారా ఈ రోజుల్లో పెట్టిన పెట్టుబడికి డబుల్ ప్రాఫిట్స్ వస్తున్నాయి. ఇక అందులో పాల్గొంటే రెమ్యూనరేషన్స్ సినిమాల్లో కంటే ఎక్కువగా వస్తున్నాయి. ఒక సినిమా కోసం రోజు గంటల తరబడి వర్క్ చేయాలి. అది కూడా ఏడాది పట్టచ్చు అంతకంటే ఎక్కువ సమయం కూడా పట్టవచ్చు. కానీ బుల్లితెరపై షోలో రోజుకు ఒక పూట కష్టపడితే చాలు.. దాదాపు రెండు సినిమాల రెమ్యునరేషన్స్ రెండు నెలల్లో సంపాదించవచ్చు.
ఇక ఎన్టీఆర్, నాగార్జున వంటి వాళ్ళు రియాలిటీ షోలతో ఏ స్థాయిలో క్లిక్కయ్యారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక నాగార్జున బిగ్ బాస్ 5 కోవిడ్ కారణంగా వాయిదా పడ్డట్లు తెలుస్తోంది. అక్టోబర్ లో స్టార్ట్ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు డిసెంబర్ కు షిఫ్ట్ అయినట్లు సమాచారం. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరుడు కూడా ఇప్పట్లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదని సమాచారం. కరోనా అదుపులోకి వచ్చిన తరువాతే ఆ రియాలిటీ షోలపై ఫోకస్ పెట్టి ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
Follow @TBO_Updates
Post a Comment