టాలీవుడ్ లో అందరూ రిచేస్ట్ హీరోలే కానీ ఆ పేరుకు సెట్టయ్యే యువకుడు మాత్రం బెల్లంకొండ శ్రీనివాస్ అని అందరికి తెలిసిందే. మనోడు ఎలాంటి సినిమా చేసినా కూడా కలెక్షన్స్ కంటే కూడా బడ్జెట్ లెక్కలు హై రేంజ్ లో ఉంటాయి. ఇక పెట్టిన లేట్టుబడికి కొంత ప్రాఫిట్స్ అందించిన సినిమా రాక్షసుడు మాత్రమే.
ఇక సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న బెల్లంకొండ ఇటీవల తమిళ్ లో ధనుష్ చేసిన కర్ణన్ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఒక మాస్ దర్శకుడితో ఆ సినిమాను స్టార్ట్ చేస్తాడట. ఇక బడ్జెట్ 30కోట్ల వరకు కావచ్చని సమాచారం. మరి ఆ సినిమాతో శ్రీనివాస్ ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి. అలాగే బాలీవుడ్ లో ఛత్రపతి సినిమాను కూడా 50కోట్లకు పైగా బారి బడ్జెట్ తో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు.
Follow @TBO_Updates
Post a Comment