కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ తో లోకల్ కథను వద్దనుకొని కొరటాల తో నేషనల్ కథను సెట్ చేసుకున్న తారక్ ఎలాంటి హిట్టు అందుకుంటాడో గాని టీమ్ మాత్రం చాలా బలంగా ఉండాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇక కొరటాలకు పాన్ ఇండియా కొత్త కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ మాటే ఎక్కువగా నెగ్గుతోందట.
ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో ప్రాజెక్టు ఒకే అయినప్పటి నుంచి చర్చలు మొదలైనట్లు తెలుస్తోంది. కొరటాల శివ దేవిశ్రీప్రసాద్ ను అనుకుంటే తారక్ మాత్రం అనిరుధ్ కావాలని పట్టుబట్టినట్లు సమాచారం. ఇద్దరు కూడా మంచి సంగీత దర్శకులే అయినప్పటికీ ఎవరిని ఫిక్స్ చేయాలో తెలియక నిర్మాత కూడా కన్ఫ్యూజన్ లో పడ్డట్లు సమాచారం. ఇక ఈ విషయంలో ఒక క్లారిటీ రావాలి అంటే మరో ఎనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
Follow @TBO_Updates
Post a Comment