సల్మాన్ లెవెల్ తగ్గిందా? బన్నీ రేంజ్ పెరిగిందా?


టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే కేవలం తెలుగు ఆడియన్స్ అనే కాకుండా నార్త్ జనాలు కూడా అమితంగా ఇష్టపడతారు. ఇక ఇటీవల సల్మాన్ ఖాన్ ఏకంగా DJ సీటీమార్ సాంగ్ ను రాధే కోసం రీమిక్స్ చేయడంతో ఒక్కసారిగా నేషనల్ వైడ్ గా విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే సల్మాన్ కంటే బన్నీ బాగా చేశాడని ఓ వర్గం వారు భాయ్ ను ట్రోల్ చేస్తున్నారు.

ఇక వాళ్ళకు ఎక్కువగా అవకాశం ఇవ్వకుండానే అల్లు అర్జున్ అదరగొట్టేసాడు అంటూ సల్మాన్ ట్వీట్ చేశాడు. దీంతో ఇప్పుడు అందరిలో ఒక ప్రశ్న మొదలైంది. సల్మాన్ ఖాన్ లెవెల్ తగ్గిపోయిందా లేక అల్లు అర్జున్ రేంజ్ పెరిగిందా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇది కొంత కన్ఫ్యూజన్ గా ఉన్నప్పటికీ బన్నీ మాత్రం నేషనల్ వైడ్ గా వైరల్ అవ్వడానికి ఇదొక ఛాన్స్ అనే చెప్పాలి. దీంతో పుష్ప సినిమాకు కూడా భారీగా బజ్ పెరిగే ఛాన్స్ లేకపోలేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో..


Post a Comment

Previous Post Next Post