జాతిరత్నాలు డిజాస్టర్.. వైల్డ్ డాగ్ హిట్టు!!


ఒక సినిమా హిట్టయితే ప్రతి ఒక్క అంశంపై ప్రశంసలు. ఇక ప్లాప్ సినిమాకు కూడా అదే లెవెల్లో విమర్శలు. అయితే సినిమాల హిట్టు ప్లాప్ అనేది పరిస్థితులను బట్టి కూడా ఉండవచ్చని మరోసారి ఋజువయ్యింది. మొన్న విడుదలైన జాతిరత్నాలు సినిమా 30కోట్లకు పైగా లాభాలు అందిస్తే ఆ సినిమాను ఇప్పుడు ప్లాప్ అంటున్నారు. ఇక ముందు కోట్ల షేర్ కోసం చాలా కష్టపడిన వైల్డ్ డాగ్ హిట్టు బొమ్మ అంటున్నారు.

ఇది ఓటీటీ రిజల్ట్... ఓటీటీకి బిగ్ స్క్రీన్ కు ఉన్నా తేడాను ఈ రెండు ఉదాహరణ అని చెప్పవచ్చు. జాతిరత్నాలు సినిమా బిగ్ స్క్రీన్ పై హిట్టయితే ఓటీటీలో మాత్రం డిజాస్టర్. నిజానికి థియేటర్స్ లో ఆడియెన్స్ లాజిక్స్ వెతుక్కోలేదు. నలుగురితో చూస్తే ఆ వాతావరణం హడావుడి మాములుగా ఉండదు. లాజిక్స్ వెతుక్కోవాల్సిన పని కూడా ఉండదు. కోవిడ్ తరువాత మంచి కామెడీ అనే టాక్ బాగా హెల్ప్ అయ్యింది. దీంతో అదే మైండ్ తో సినిమాను ఎంజాయ్ చేశారు.

ఇక వైల్డ్ డాగ్ బిగ్ స్క్రీన్ పై డిజాస్టర్ అయితే ఓటీటీలో మాత్రం నెట్ ఫ్లిక్స్ రికార్డులను చితకొట్టేసింది. తమిళ్ లో కూడా ట్రెండ్ అవ్వడం విశేషం. ఇక సినిమా బిగ్ స్క్రీన్ పై చూసే అడియెన్స్ ఎన్నో అంచనాలతో వస్తారు. ఇక ఓటీటీ కంటెంట్ కు అలవాటు పడిన వాళ్ళు సినిమా కాన్సెప్ట్ ముందే తెలుస్తుంది కాబట్టి అదే అవగాహనతో చూస్తారు. ఎలాంటి అంచనాలు ఉండవు కాబట్టి కథలోకి వెళ్ళవచ్చు. అందుకే ఇది పర్ఫెక్ట్ ఓటీటీ మూవీ అనే కామెంట్స్ వస్తున్నాయి.

Post a Comment

Previous Post Next Post