సెకండ్ వేవ్ దెబ్బ.. థియేటర్స్ మళ్ళీ....!


కరోనా ధాటికి టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మరోసారి ఇబ్బందుల్లోకి పడే పరిస్థితికి వచ్చింది. రోజురోజుకు కరోనా తాకిడి తీవ్ర భయంకరమైన రూపం దాల్చుతోంది. తెలంగాణలో నైట్ కర్ఫ్యూ అమలులోకి వచ్చేసింది. ఇక కరోనా ప్రభావం ఎక్కువగా పడకూడదని మిగతా విషయాల్లో కూడా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోక తప్పడం లేదు.

ఇక తెలంగాణాలో 8 తరువాత షోలు మొదలయ్యే ఛాన్స్ లేదు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే 50% ఆక్యుపెన్సీకి మరోసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక థియేటర్స్ క్రమపద్ధతిలో 50% జనాలతో మాత్రమే ఉండాలి. రెండు సీట్లకు మధ్యలో ఒక సీటు తప్పనిసరిగా ఖాళీగా ఉండాల్సిందే. ఈ రూల్స్ ను ఏ మాత్రం అతిక్రమించినా కూడా థియేటర్స్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తప్పవని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం హెచ్చరించింది.


Post a Comment

Previous Post Next Post