మరో అతడు.. ఈసారి తస్కరించకపోతే చాలు!


త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల మాంత్రికుడు అనే ట్యాగ్ తో ఎంతో మంది అభిమానులకు దగ్గరయ్యాడు. ఆయన మాటలతోనే కాకుండా కాపీ కొట్టి కూడా మాయా చేస్తాడని సోషల్ మీడియా ప్రభావంతో అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది. నిజానికి త్రివిక్రమ్ టాలెంట్ ఉన్న దర్శకుడే.. ఎన్నో హాలీవుడ్ సీన్స్ ను తన కథకు నచ్చినట్లుగా వాడుకున్నారు.

కాపీ కొడితే కొట్టారు గాని అందంగా ప్రజెంట్ చేశారు అనేలా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ కాలం అప్పటిలా లేదని ఆయనకు అజ్ఞాతవాసితోనే జ్ఞానోదయం అయ్యుండాలి. అందుకే ఆ తరువాత సొంత కథలతో మ్యాజికల్ హిట్స్ కొట్టాడు. ఇక ఈ సారి మహేష్ తో చేస్తున్న సినిమా కొంచెం అతడు స్టైల్ లో ఉంటుందట. ట్విస్ట్ తో పాటు సీరియస్ సీన్స్, ఫ్యామిలీ లవ్ ఎమోషన్స్ వంటి అంశాలు చాలానే ఉంటాయట. మరి ఆ సినిమాతో మాటల మాంత్రికుడు అడియెన్స్ ను ఎంత కొత్తగా ఆకట్టుకుంటాడో చూడాలి.


Post a Comment

Previous Post Next Post