మహేష్ - త్రివిక్రమ్.. అంతకుమించి కుదరదా? - TollywoodBoxoffice.in

Exclusive Portal for Boxoffice Collections

మహేష్ - త్రివిక్రమ్.. అంతకుమించి కుదరదా?


టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గత కొన్నేళ్లుగా అగ్ర దర్శకుడిగానే కొనసాగుతున్నప్పటికి జులాయి అనంతరం ఆయన స్టైల్ రొటీన్ గానే కొనసాగుతోంది. పూరి జగన్నాథ్, సుకుమార్ వంటి దర్శకులు పాన్ ఇండియా అంటుంటే త్రివిక్రమ్ మాత్రం ఇంకా ఫ్యామిలీ ఫ్యాక్షన్ చుట్టూనే తిరుగుతున్నాడు.

ఇప్పుడు హీరోలు కూడా పాన్ ఇండియా కథలనే కావాలని అంటున్నారు. ఎన్టీఆర్ సినిమా క్యాన్సిల్ అవ్వడానికి కారణం కూడా అదే. ఇక నెక్స్ట్ మహేష్ బాబుతో చేయబోయే సినిమా కూడా ఫ్యామిలీ యాక్షన్ తరహాలో రానుందట. సాధారణంగా త్రివిక్రమ్ ఫ్యామిలీ కథలను కరెక్ట్ గా ప్రజెంట్ చేయగలిగితే బాక్సాఫీస్ వద్ద ఈజీగా 100కోట్ల బిజినెస్ చేయగలవు. కానీ ఆయన స్థాయి పెరగడం వలన అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. మహేష్ తో మళ్ళీ అదే జానర్ అంటే వాళ్ళకు అంతగా నచ్చడం లేదు. మరి గురూజీ రొటీన్ ఫార్ములా ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.